వివేక హత్యపై మళ్లీ విచారణ… కడపలో సీబీఐ బృందం

-

అవరావతి: వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద హత్య కేసు మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. 2019 సాధారణ ఎన్నికలకు ముందు కడప జిల్లా పులివెందులలో వివేక హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి కేసు పలు మలుపులు తిరిగింది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు అనుమానితులను అధికారులు విచారించారు. తాజాగా మరోసారి విచారణకు వారికి నోటీసులు జారీ చేశారు. గత ఏడాది విచారణ సమయంలో పలువురు అధికారులకు కరోనా రావడంతో ఈ కేసు విచారణను కొంతకాలం వాయిదా వేశారు. మళ్లీ కేసు విచారణను కొనసాగించనున్నారు. వివేక నివాసానికి వెళ్లనున్నారు. పులివెందుల పరిసర ప్రాంతాలను పరిశీలించనున్నారు.

కాగా ఏపీలో వైఎస్ వివేకా హత్య సంచలన రేపింది. ఇంట్లోనే ఆయనను హత్య చేశారు. అప్పట్లో ఈ కేసును చంద్రబాబు నాయుడు సిట్‌కు అప్పగించారు. ఈ తర్వాత వివేక కూతురు సునీత అభ్యర్థన మేరకు కేసును సీబీఐకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతతో పాటు కుటుంబ సభ్యులందరిని అధికారులు విచారించారు. హత్య జరిగిన ఆయన ఇంటిలోని బెడ్ రూమ్, బాత్ రూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news