అదిరే ఆఫర్.. ఈ బ్యాంక్ హోమ్ లోన్‌లపై వడ్డీ తగ్గింపు…!

-

చాలా మందికి సొంత ఇళ్లు నిర్మించుకోవడం అనేది పెద్ద కల. అలాంటి వాళ్ళు సొంత ఇల్లుని నిర్మించుకోవాలంటే ఇప్పుడు పెద్ద కష్టం ఏమి కాదు. ఎందుకంటే హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లని ప్రైవేట్ రంగ బ్యాంకు కోటక్ మహేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి మంచిది.

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. గృహ రుణ వడ్డీ రేట్లను 6.65 శాతం నుండి 6.50 శాతానికి తగ్గించింది బ్యాంక్. ఇది సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది , నవంబర్ 8 వరకు ఉంటుంది. అయితే బ్యాంక్ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పరిమిత కాలానికి ప్రవేశపెట్టబడింది.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే HDFC , SBI బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది. మహమ్మారి సమయంలో ప్రజలు ఇళ్లు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో గృహ రుణాలకు డిమాండ్ పెరిగింది. ఇది ఇలా ఉంటే గత ఏడాది అక్టోబర్‌లో అతి తక్కువ రేటును అందించింది ఈ బ్యాంక్. అప్పుడు అది వడ్డీ రేటును 6.9 శాతానికి తగ్గించింది. అప్పటి నుండి చూస్తే ఇది మరో రెండు కోతలు చేసింది. ఇప్పుడు దాని ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేటు 6.65 శాతం.

 

Read more RELATED
Recommended to you

Latest news