బీజేపీ.. టీఆర్ఎస్.. ఇద్దరి మధ్య దోస్తీ వార్తలపై బీజేపీ నేతల వ్యాఖ్యలు

ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ సిద్ధం అవుతున్నట్లు అర్థం అవుతుంది. అటు బీజేపీ నేతలు కూడా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై గట్టిగా స్పందిస్తున్నారు. ఐతే ఈ మధ్య వస్తున్న వార్తలు, టీఆర్ఎస్, బీజేపీకి మధ్య దోస్తీ ఉన్నట్లు చూపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకటే అని, వీరిద్దరి మధ్య ఎవరికీ తెలియని దోస్తీ ఉందని ప్రకటించాయి. ఆ వార్తలపై స్పందించిన బీజేపీ నేతలు, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

బండి సంజయ్ మాట్లాడుతూ, కొంతమంది తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, టీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాలేవని అన్నారు. దేశభక్తి కలిగిన ఏకైక పార్టీ బీజేపీనే అని, హిందూధర్మానికి అడ్డువస్తే సహించేది లేదని, బీజేపీ పార్టీ ఏ ఒక్క కులానికి గానీ, మతానికి గానీ వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పేదల రాజ్యం వచ్చేదాకా పోరాడతామని, గోల్కోండ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తామని బండి సంజయ్ ప్రకటించారు.