కేవలం రూ.95 తో 14 లక్షల రూపాయలు ఇలా పొందొచ్చు…!

పోస్టాఫీస్ అనేక రకాల సేవలని అందిస్తోంది. వాటిలో ఒకటి గ్రామ్​ సుమంగల్​ స్కీమ్​ కూడా ఒకటి. దీని ద్వారా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ స్కీమ్​ కింద పాలసీదారునికి మెచ్యూరిటీ ప్రయోజనాలు పొందొచ్చు. ఒకవేళ పాలసీదారుడికి మరణిస్తే నామినీకి బోనస్‌తో పాటు మొత్తం సమ్​ అస్యూర్డ్ అమౌంట్​ వస్తుంది. ఈ పాలసీని 15 ఏళ్లు లేదా 20 ఏళ్ల వ్యవధి తో తీసుకోవచ్చు.

ఈ పాలసీలో చేరడానికి కనీస వయస్సు 19 సంవత్సరాలు. 45 ఏళ్ల వయస్సు వచ్చే వరకు15 ఏళ్ల వ్యవధి గల పాలసీని తీసుకోవచ్చు. 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు 20 ఏళ్ల వ్యవధి గల పాలసీని తీసుకోవచ్చు.ఇది ఇలా ఉంటే దీని వలన కలిగే లాభాలు చూస్తే.. ఈ పాలసీకి గరిష్టంగా రూ .10 లక్షల వరకు హామీ ఇవ్వబడుతుంది.

పాలసీలో చేరిన వారికి 6 ఏళ్లు, 9 ఏళ్లు, 12 ఏళ్లలో 20 శాతం చొప్పున డబ్బులు తీసుకోవచ్చు. ఒకవేళ 15 సంవత్సరాల టర్మ్​ గల పాలసీని తీసుకుంటే 6, 9, 12 ఏళ్లలో వరుసగా 20 శాతం డబ్బులు వచ్చే ఛాన్స్ వుంది. మెచ్యూరిటీ పూర్తయిన సమయంలో మిగిలిన 40 శాతాన్ని బోనస్‌తో కలిపి వచ్చేస్తాయి.

అదే మీరు కనుక మీరు 20 సంవత్సరాల టర్మ్​ గల పాలసీని తీసుకుంటే 8, 12, 16 ఏళ్లలో వరుసగా 20 శాతం మనీబ్యాక్ లభిస్తుంది. మిగిలిన 40 శాతం బోనస్‌తో మెచ్యూరిటీ తో పాటు వస్తుంది. ఒకవేళ మీకు 25 ఏళ్ల వయస్సు అయితే 20 సంవత్సరాల వ్యవధితో దీనిని తీసుకుంటే రూ .7 లక్షల సమ్​ అస్యూర్డ్​ అమౌంట్​ కోసం అతను నెలకు రూ .2,853 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

అంటే, రోజుకు రూ .95 చొప్పున చెల్లించాలి. ఇలా చెల్లిస్తే 8, 12, 16 సంవత్సరాల్లో 20 శాతం చొప్పున పొందచ్చు. ప్రతిసారి రూ .1.4 లక్షలు లభిస్తాయి. చివరగా, ప్లాన్​ వ్యవధి ముగిసే 20 వ సంవత్సరంలో ఒకేసారి 40 శాతం అనగా రూ .2.8 లక్షలు వస్తాయి.

ఇది ఇలా ఉంటే వెయ్యికి వార్షిక బోనస్ రూ. 48 అనుకుంటే, రూ. 7 లక్షలకు వార్షిక బోనస్ రూ. 3,36,00 అవుతుంది. ఈ లెక్కన 20 ఏళ్లు పూర్తయ్యే సమయంలో బోనస్​ రూ .6.72 లక్షలు వస్తాయి. ఇలా 20 సంవత్సరాల పాలసీ వ్యవధి లో రూ .4.2 లక్షల (మనీ బ్యాక్‌), రూ .9.52 లక్షల (మెచ్యూరిటీ) మొత్తం కలిపితే రూ. 13.72 లక్షలని మీరు తీసుకోవచ్చు.