కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.20 లక్షల వరకు బెనిఫిట్స్..!

-

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్‌ఫేర్ గ్రాట్యుటీ ప్రయోజనాల గురించి పెన్షన్ రూల్స్ 2021 లో వివరించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సీనియారిటీని బట్టి గ్రాట్యుటీ వస్తుంది. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే నామినీకి వస్తుంది. ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీ లభించనుంది.

ఇక దీనికోసం పూర్తి వివరాల లోకి వెళితే.. క్వాలిఫయింగ్ సర్వీస్‌లో పూర్తి చేసిన ప్రతీ ఆరు నెలల కాలానికి నాలుగులో ఓ వంతు కేంద్రం పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ ఇస్తుంది. ఐదేళ్ల క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే ఇది వర్తిస్తుంది. రూల్ 44 ప్రకారం వారికి పెన్షన్, సర్వీస్ గ్రాట్యుటీ వర్తిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీస్ పూర్తి కాకుండా మరణిస్తే అప్పుడు నామినీకి ఇస్తారు.

గ్రాట్యుటీ మొత్తం వేతనానికి 16.5 రెట్ల లోపే ఉంటుంది. అలానే ఈ గ్రాట్యుటీ అనేది సర్వీసుని బట్టీ లభిస్తుంది. క్వాలిఫయింగ్ సర్వీస్ ఒక ఏడాది లోపు ఉంటే రెండు రేట్లు, సర్వీస్ 1 ఏడాది నుంచి 5 ఏళ్ల లోపు ఉంటే వేతనం కన్నా 6 రెట్లు గ్రాట్యుటీ, ఏళ్ల నుంచి 11 ఏళ్ల లోపు ఉంటే వేతనం కన్నా 12 రెట్లు గ్రాట్యుటీ, క్వాలిఫయింగ్ సర్వీస్ 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఉంటే వేతనం కన్నా 20 రెట్లు గ్రాట్యుటీ వస్తుంది.

20 ఏళ్ల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు క్వాలిఫయింగ్ సర్వీస్‌లో ప్రతీ పూర్తైన ఆరు నెలల వ్యవధికి సగం జీతం చొప్పున గ్రాట్యుటీని లెక్కిస్తారు. మాక్సిమం 33 రెట్ల గ్రాట్యుటీ మాత్రమే లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ తేదీ కన్నా ఐదేళ్ల లోపు మరణిస్తే వేతనం కన్నా పెన్షన్ నిబంధనల ప్రకారం వారి కుటుంబానికి రెసిడ్యూరీ గ్రాట్యుటీని ఇవ్వడం జరుగుతుంది. గతంలో రూ.10 లక్షల కన్నా ఎక్కువ గ్రాట్యుటీ పొందినట్టైతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(10) ప్రకారం పన్నుకట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగులు రూ.20 లక్షల గ్రాట్యుటీ పొందినా కట్టక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news