మహిళల కోసం అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా పథకాలు!

-

ఆరోగ్య బీమా అనేది కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. దేశ జనాభాలో దాదాపు 71 శాతం మహిళలు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నవారే నని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే వారి కోసం కొన్ని బీమాలు అందుబాటులో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది దృష్టి ఆరోగ్య బీమా వైపు మళ్లింది. స్త్రీలు చాలా వరకు పాలసీలను తక్కువగా తీసుకుంటారు. సాధారణంగా మహిళలు ఇంటి పని, ఆఫీస్‌ పని ఇలా అనేక ఒత్తిళ్లకు లోనవుతారు. అందుకే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే అనేక ఆరోగ్య సంస్థలు మహిళల కోసమే ప్రత్యేకం బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ లాభాలు పొందే ప్రీమియంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్లాన్లలో చేరడం వల్ల మీ ఆరోగ్యానికి సంబంధించిన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు.

వివిధ ఆరోగ్య బీమా పథకాలు

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్మార్ట్‌ ఉమెన్‌ ప్లాన్‌
ఇది మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన జీవిత బీమా పాలసీ. ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్లాన్‌ ప్రారంభ ప్రీమియంలు సంవత్సరానికి రూ.24,000 నుంచి ప్రారంభమవుతాయి. దీన్ని వార్షిక ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌కమ్‌ ఫండ్, బ్యాలెన్సిడ్‌ ఫండ్‌, బ్లూ–చిప్‌ ఫండ్, ఆపర్చునిటీస్‌ ఫండ్‌ వంటి నాలుగు ఎంపికల్లో ఏదైన ఎంచుకోవచ్చు.

ప్లాన్‌ బెనిఫిట్‌ ఆప్షన్స్‌ 

  • గర్భధారణ సమస్యలు లేదా పుట్టుకతో వచ్చే రుగ్మతలకు ట్రీట్‌మెంట్‌
  • స్త్రీ అవయవాల కేన్సర్‌ నిర్ధారణ
  • జీవిత భాగస్వామి మరణిస్తే కుటుంబానికి ఆసరాగా ఆర్థిక ప్రయోజనాలు. పై మూడు ఆప్షన్లలో ఏదేనీ ఒక దాన్ని ఎంచుకోవచ్చు.

టాటా– ఎఐజీ వెల్సూరెన్స్‌ ఉమెన్‌ పాలసీ
ఈ ప్లాన్‌ కింద మీ వైద్యానికయ్యే ఎక్కువ ఖర్చులు ఒకే మొత్తంలో పొందుతారు. అంబులెన్స్‌
ఖర్చులు, నష్టపరిహారం వంటివి కూడా చెల్లిస్తారు. ఈ పాలసీని 11 ముఖ్యమైన అనారోగ్యాలకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వీటికి బీమా చేసిన మొత్తాన్ని ఒకే మొత్తంలో చెల్లిస్తారు. ఒకవేళ ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా మీరు ఆసుపత్రిలో చేరినప్పుడు, మీకు నగదు చెల్లిస్తారు. సౌందర్య పునరుద్ధరణ శస్త్రచికిత్సలు చేసుకున్నప్పుడు నష్టం జరిగినా క్లెయిమ్‌లు పొందవచ్చు.

జీవన్‌ భారతి–1
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసి అందిస్తున్న బీమా పథకం జీవన్‌ భారతి. దీన్ని ప్రత్యేకంగా మహిళల కోసమే రూపొందించారు. ఈ ప్యాకేజీలో యాక్సిడెంట్‌ బెనిఫిట్, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెనిఫిట్, పిల్లల పుట్టుకతో వచ్చే వైకల్యానికి చికిత్స వంటి బెనిఫిట్స్‌ ఉన్నాయి.

బజాజ్‌ అలియాంజ్‌ ఉమెన్‌ స్పెసిఫిక్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌
తమను తాము రక్షించుకోవడానికి మహిళలకు అందిస్తున్న ఒక అద్భుతమైన ఎంపిక. బజాజ్‌ అలియాంజ్‌ సంస్థ దీన్ని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది మహిళల ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నపుడు ఉపయోగపడుతుంది. కాగా, పాలసీదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80 డీ కింద ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు

రిలయన్స్‌ హెల్త్‌ గెయిన్‌ పాలసీ రిలయన్స్‌
హెల్త్‌ గెయిన్‌ పాలసీ వ్యక్తిగతంగా, ఫ్యామిలీ మొత్తానికి రక్షణగా నిలుస్తుంది. ఈ ప్లాన్‌ కింద అవివాహిత మహిళలు లేదా ఒంటరి మహిళలకు 5% ప్రీమియం తగ్గింపు లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మీ వైద్య ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే, ప్లాన్‌ ఎ– కింద రూ. 3 లక్షలు, రూ. 6 లక్షలు, రూ. 9 లక్షలు, ప్లాన్‌ బి కింద రూ. 12 లక్షలు, రూ. 15 లక్షలు, రూ. 18 లక్షలు సమ్‌ అస్యూర్డ్‌ అమౌంట్‌తో కూడిన పాలసీని ఎంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version