కేవలం ఒక్క మిస్డ్ కాల్ తో గ్యాస్ బుక్ చెయ్యండి..!

-

మీరు గ్యాస్ బుక్ చెయ్యాలని అనుకుంటున్నారా..? లేదా కొత్తగా గ్యాస్ (LPG) కనెక్షన్ పెట్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఈ పనులు మరెంత సులభంగా అయ్యిపోతాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

gas cylinder
gas cylinder

ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇండేన్ గ్యాస్ కనెక్షన్ ని కేవలం ఒక్క మిస్డ్ కాల్ తో తీసుకునే అవకాశాన్ని కల్పించింది. దీనిని ట్విట్టర్ వేదికగా పంచుకోవడం జరిగింది. 8454955555 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సింపుల్ గా గ్యాస్ కనెక్షన్ పొందవచ్చని.. అదే విధంగా గ్యాస్ ని కూడా బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది.

ఎవరైనా కొత్త సిలిండర్ బుక్ చెయ్యాలంటే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి ఈ 8454955555 నెంబర్ కి కేవలం మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఈ సర్వీసు దేశంలో ఎక్కడైనా సరే పొందొచ్చు అని తెలిపారు. ఇంటి వద్దే రెండో సిలిండర్ (డబుల్ బాటిల్ కనెక్షన్-డీబీసీ) పొందే అవకాశాన్ని సైతం కల్పించారు. ఆసక్తి కలిగిన వినియోగదారులు 14.2 కేజీల సిలిండర్ కి బదులుగా 5 కేజీల సిలిండర్ ని ఎంపిక చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ సిలిండర్‌లో గ్యాస్‌ ఎప్పుడైపోతుందో తెలిసిపోతుంది!

మీరు గ్యాస్‌ సిలిండర్‌ వాడుతున్నారా? అయితే, సీల్‌ చూసి మోసపోకండి!

 

Read more RELATED
Recommended to you

Latest news