బ్రేకింగ్; సామాన్యులకు కూడా ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్…!

-

ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా వెల్లడించారు. దీనికి సంబంధించి జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలు ఉండగా వాటి అన్నింటికీ ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది.

ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడి౦చనున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సామాన్యులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ ఎన్నికల నుంచే ఈ విధానం ప్రవేశ పెట్టాలని ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు కేవలం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిన ఎన్నికల సంఘం, ఇప్పుడు సామాన్యులకు కూడా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కాని షరతులు వర్తిస్తాయి. ఆ అవకాశం దివ్యాంగులు, శారీరక సమస్యలతో బాధపడేవాళ్లు, అనివార్య కారణాలతో పోలింగ్ బూత్‌కు రాలేని వాళ్లకు, 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు, ఓటు వేయలేని వాళ్ళ కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news