రూ.500 ప్రీమియంతో రూ.10 లక్షలు…!

-

ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండటం తప్పనిసరి. ఎప్పుడు ఏం అవుతుందనేది ఎవరూ ఊహించలేము. ప్రమాదం లో ప్రాణాలు పోతే ఇబ్బంది పడిపోవాల్సి కుటుంబ సభ్యులు. అలాంటి సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు పర్సనల్‌ యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉండాలి. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఎంతో అవసరం అవుతుంది. పాక్షిక, శాశ్వత అంగవైకల్యం వంటివి సంభవించినప్పుడు ఇది ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ లాగే ఈ పాలసీ లో కుటుంబానికి మొత్తం పరిహారం వస్తుంది. శాశ్వత వైకల్యాలకు 100 శాతం బీమా వర్తిస్తుంది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన వలన కలిగే లాభాలు:

ఆరోగ్యం బాగయ్యేదాకా సెలవుల్లో ఉండాలి. అప్పుడు సమ్‌ అష్యూర్డ్‌ లో ఒక్క శాతం వరకూ బీమాదారుడికి ఇస్తారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక వైద్యం, మందులు వంటి ఖర్చులకి బీమా కవరేజీ వస్తుంది.
యాక్సిడెంటల్‌ హాస్పిటల్‌ డైలీ, వీక్లీ అలవెన్స్‌ ప్రయోజనాలను పొందవచ్చు.
గరిష్టంగా రూ.20 వేల వరకు ఇస్తారు.

ఎవరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కి అర్హులు..?

18 నుంచి 65 సంవత్సరాలు వారు దీనికి అర్హులు.
ఒక్కొక్కరికి లేదా కుటుంబం మొత్తానికి కూడా ప్రమాద బీమా పాలసీని తీసుకోవచ్చు.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వాళ్లకి పనుల మీద ట్రావెల్ చేసేవాళ్ళు బీమా తీసుకోవడం మంచిది.

ఎంత ప్రీమియం కట్టాలి..?

రూ.10 లక్షల ప్రమాద బీమా కి గరిష్ఠంగా రూ.500-1,000 మధ్య ప్రీమియం ఉంటుంది. మెడికల్‌ ఖర్చులు, పిల్లల చదువు, ప్రమాదం అనంతరం సెలవులకు ఖర్చులు వంటి వాటి మీద యాడ్‌ ఆన్స్‌ ఉంటాయి. రూ.200 ప్రీమియంతో రూ.4 లక్షలకు బీమాను కల్పిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version