ఉద్యోగిని యోజన పథకంతో.. మహిళా వ్యాపారులకు కలిగే లాభాలు..!

-

చాలా శాతం మంది మహిళలకు వ్యాపారాలను ప్రారంభించాలని ఉంటుంది. కాకపోతే ఆర్థిక సహాయం లేకపోవడం వలన ప్రారంభించరు. అయితే కొంతమంది సంపాదన కోసం చిన్న చిన్న వ్యాపారాలను చేస్తూ ఉంటారు. అయితే వారి కోసం ఆత్మనిర్భార్ కార్యక్రమం లో భాగంగా మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా రుణాన్ని తక్కువ వడ్డీకే అందిస్తోంది. ఎప్పుడైతే ఇటువంటి పథకాలను ప్రభుత్వం అందజేస్తుందో మహిళలకు ఆసక్తి పెరుగుతుంది. దీంతో వ్యాపారాలను ప్రారంభించాలని మరియు అభివృద్ధి చేయాలని అనుకుంటారు.

అయితే ఈ పథకంలో భాగంగా 3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు మరియు వైకల్యము ఉండేటువంటి మహిళలు, వితంతువులు తీసుకునే రుణానికి ఎటువంటి పరిమితి లేదు. పైగా వారు తీసుకునే రుణం పై ఎలాంటి వడ్డీ కూడా ఉండదు. కానీ మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు అయితే 10% నుండి 12% వరకు వడ్డీ ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే రుణం పొందే బ్యాంకు నిబంధనల ప్రకారం అ వడ్డీ అనేది మారుతూ ఉంటుంది. ఒకవేళ రుణం తీసుకునేటువంటి మహిళ కుటుంబ వార్షిక ఆదాయం తక్కువ ఉన్నట్లయితే, వారికి సబ్సిడీని కూడా కల్పిస్తారు. ఈ సబ్సిడీ 30% వరకు ఉంటుంది.

అర్హత వివరాలు:

ఉద్యోగిని పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 55 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. ఈ పథకంలో భాగంగా రుణాన్ని పొందే మహిళల క్రెడిట్ స్కోర్ మరియు సిబిల్ స్కోర్ బాగుంటే రుణాన్ని త్వరగా పొందవచ్చు. కాకపోతే గతంలో ఏవైనా రుణాలు సరిగా చెల్లించకుండా ఉన్నట్లయితే రుణాన్ని ఇవ్వరు.

దరఖాస్తు చేసే విధానం:

ఉద్యోగిని పథకానికి సంబంధించిన దరఖాస్తును అధికారిక వెబ్సైట్ ద్వారా పొందవచ్చు మరియు దానిలో అడిగిన వివరాలను పూరించి దరఖాస్తు తో పాటుగా ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు మరియు బ్యాంకు ఖాతా పుస్తకం వంటి మొదలైన డాక్యుమెంట్లతో పాటుగా సమర్పించాలి. ఈ విధంగా దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అర్హులకు బ్యాంకు రుణాన్ని అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version