మీకు ఈ బ్యాంక్ లో ఖాతా వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్ ని అందించింది. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ బ్యాంక్ కస్టమర్స్ కి అదిరిపోయే లాభాలు కలగనున్నాయి. ఈ బ్యాంక్ డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. జూన్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కనుక ఈ లోగా బ్యాంక్ కస్టమర్స్ ఈ ఆఫర్ ని వినియోగించుకుంటే మంచిది.
డెబిట్ కార్డు ద్వారా జరిపే అన్ని రకాల కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద గరిష్టంగా రూ.1000 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ అన్ని ట్రాన్సాక్షన్లకు వర్తించదు. కొన్ని పరిమితులు ఉన్నాయి.
ఒకవేళ ఏటీఎం విత్‌డ్రాయెల్స్ చేసిన లేదా ఈవాలెట్ మనీ ట్రాన్స్‌ఫర్ కానీ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి వాటిని చేసిన ఈ ఆఫర్ వర్తించదు గమనించండి. అంటే క్యాష్‌బ్యాక్ రాదు.
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వీసా డెబిట్ కార్డు వాడే వారికే ఈ 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ముగిసిన నెల రోజుల తర్వాత క్యాష్‌బ్యాక్ డబ్బులు పడతాయి. ఇలా కస్టమర్స్ ఈ ఆఫర్ ని పొందవచ్చు.