న్యూఢిల్లీ: పలుదేశాలను కోవిడ్‌లో మరో రకం కలవరపెడుతోంది. చాలా దేశాల్లో లాంబ్డా అనే కరోనా వేరియంట్ విస్తరిస్తోంది. లాంబ్డా వేరియంట్‌పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దృష్టి సారించింది. బ్రిటన్‌లో ఇప్పటివరకూ ఆరు లాంబ్డా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.
గత ఏడాది ఆగస్టులో పెరూలో తొలి కేసు వెలుగు చూసింది. చిలీ, ఈక్వెడర్, అర్జెంటీనా సహా 29 దేశాలకు ఈ లాంబ్డా విస్తరించింది. పెరులోని కరోనా కేసుల్లో లాంబ్డా వేరియంట్ 81 శాతం ఉంది. తీవ్ర ఇన్ పెక్షన్ వస్తుందనేందుకు ఆధారల్లేవని పబ్లిక్ హెల్త్ ఆప్ ఇంగ్లండ్ ప్రకటించింది. టీకాలకు నిరోధకత చూపుతుందనేందుకు ఆధారాల్లేవని స్పష్టం చేసింది.
ఇప్పటికే కరోనా తొలి, సెకండ్ వేవ్‌లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. భారీగా కరోనా సోకి ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పుడు కోవిడ్ లో మరో రకం వేరియంట్ విజృంభిస్తుండటంతో ప్రపంచ జనం హడలిపోతున్నారు. ఈ కొత్త రకం రక్కసిని త్వరగా నియంత్రించాలని కోరుతున్నారు.