పెన్షనర్లకు కేంద్రం తీపికబురు.. రూ.5 లక్షలు పొందండిలా..!

-

నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS సబ్‌స్క్రైబర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో పెన్షనర్లు కి ఊరట కలుగుతుంది అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పెన్షన్ కార్పస్ డబ్బులను ఒకేసారి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది నేషనల్ పెన్షన్ సిస్టమ్.

cash
cash

దీనితో డబ్బులను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని వలన చాలా మందికి ఊరట కలుగనుంది. ఈ ఎన్‌పీఎస్ స్కీమ్‌ లో చేరిన వారు మెచ్యూరిటీ సమయం లో మొత్త్తం అంతా వెనక్కి తీసుకోవడం కుదరదు.

వీటిలో కొంత డబ్బు తో మాత్రం యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో సబ్‌స్క్రైబర్లకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం ఈ రూల్స్ లో కాస్త మార్పులని కేంద్రం తీసుకు వచ్చింది.

ఇక వాటి కోసం చూస్తే.. పెన్షన్ కార్పస్ రూ.5 లక్షలకు వరకు ఉంటే పూర్తి డబ్బులను ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు అని అంది. దీనితో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చెయ్యక్కర్లేదు. గతం లో అయితే రూ.2 లక్షల వరకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉండేది.

అంటే కార్పస్ మొత్తం రూ. 2 లక్షల వరకు ఉంటే.. పూర్తి డబ్బులు వెనక్కి తీసుకునే వారు. ఇకపై రూ.5 లక్షల వరకు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. కాబట్టి డబ్బులు వెనక్కి తీసుకోవాలనుకునే వారు తీసుకొచ్చు. అయితే న్‌పీఎస్ స్కీమ్‌ లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటేమో టైర్ 1 అకౌంట్. రెండోదేమో టైర్ 2 అకౌంట్ వున్నాయి. ప్రస్తుతం యాన్యుటీ ప్లాన్‌పై 5.5 శాతం వరకు రాబడి వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news