హైదరాబాద్‌లో కోట్ల విలువైన భూమి కబ్జా.. కేసు నమోదు

-

హైదరాబాద్: బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో రూ.12 కోట్లు విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. తహశీల్దార్ సంతకాన్ని బిల్డర్ అసదుల్లా పాషా ఫోర్జరీ చేశారు. అంతేకాదు సర్వే నెంబర్ 129 లోని 600 గజాలు భూమిని కబ్జా చేశారు. ఎన్‌వోసీ‌పై ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ పత్రాలను అసదుల్లా పాషా కోర్టుకి సమర్పించినట్లు షేక్ పేట్ తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి గుర్తించారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బంజారాహిల్స్‌లో రూ.12 కోట్ల విలువైన ల్యాండ్‌ను కబ్జా చేయాలని చూశారన్నారు. 2019‌లో బిల్డర్ అసద్దుల్లా పాషా అనే వ్యక్తి రెవెన్యూ అధికారి ఎన్‌వోసీ ఇచ్చినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించాడని తెలిపారు. గతంలో పని చేసిన తహశీల్దార్ వెంకట్ రెడ్డి పేరుతో ఎన్‌వోసీపై ఫోర్జరీ సంతకం చేసి కోర్ట్‌కి సమర్పించారని చెప్పారు. ప్రభుత్వ భూమి అని పాతిన బోర్డు తొలగించి నిర్మాణం చేయాలని చూశారని చెప్పారు. దీంతో ఫోర్జరీ పత్రాలను పోలీసులుకు అందజేసి పాషాపై కేసు నమోదు చేయించామని తెలిపారు. రెవెన్యూ రికార్డ్‌లో సర్వే నెంబర్ 129లో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా ఉందన్నారు. ఎన్‌వోసీ‌లు ఇచ్చే అధికారం తహశీల్దార్‌కి ఉండదని, కలెక్టర్‌తో ఒక కమిటీ విచారణ చేసి ఎన్‌వోసీలు ఇస్తుందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news