ఏటీఎం లో డబ్బులు విత్ డ్రా రూల్స్ లో మార్పులు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి మంచి సర్వీసులని ఇస్తుంది. అలానే సైబర్ నేరాలకు గురి అవ్వకుండా అలర్ట్ చేస్తుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోసాలను నివారించడానికి సరి కొత్త విధానాన్ని తీసుకు వచ్చింది. పూర్తి వివరాల లోకి వెళితే.. మోసాలను నివారించడానికి ఓటీపీ పద్దతిని తీసుకొచ్చింది.

SBI
SBI

స్టేట్ బ్యాంకు ఖాతాదారులు గతంలో లాగా ఏటీఎం సెంటర్ కు వెళ్లి క్యాష్ తీసుకోవడం అవ్వదు. తప్పక ఏటీఎం కి వెళితే మీ యొక్క ఫోన్ ని తీసికెళ్ళాలి. అయితే డబ్బులను విత్ డ్రా చేసే సమయంలో రిజిస్టర్ ఫోన్ నంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. లేదు అంటే డబ్బులని డ్రా చెయ్యడం అవ్వదు. అయితే నేరగాళ్ల నుంచి ఖాతాదారులకు రక్షణ ఏర్పడుతుందని బ్యాంక్ అంది.

తన ట్విట్టర్ ఖాతాలో దీనిని పోస్ట్ చేసింది. ఈ పద్దతిని కేవలం స్టేట్ బ్యాంక్ మొదలు పెట్టింది. రూ. 10 వేల లోపు డబ్బులు డ్రా చేసుకునే వారు ఈ ఓటీపీ లేకుండానే డబ్బులు తీసుకోచ్చు. కానీ రూ. 10 వేలు లేదా అంతకన్నా ఎక్కువ డ్రా చేసుకునే వారు మాత్రం కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాలి.

ఏటీఎం సెంటర్ కు వెళ్లే సమయంలో డెబిట్ కార్డుతో పాటు, రిజిస్టర్ మొబైల్ నంబర్ ని ఖాతాదారులు తీసికెళ్ళాలి. ఏటీఎం కార్డును ఇన్ సర్ట్ చేసి పిన్ నంబర్ ఎంటర్ చేసి.. విత్ డ్రా చేయాలనుకుంటన్న మొత్తాన్ని నమోదు చేయాలి. రూ. 10 వేల కన్నా ఎక్కువగా ఉంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసాక డబ్బులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news