హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ బిజెపిని వీడి కాంగ్రెస్ లో కలుస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ని ఈటెల రహస్యంగా కలిశారని కేటీఆర్ ఆరోపించారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు. రాజకీయ నాయకుడు అనేవాడు విశాలమైన ఆలోచనలు చేయాలని అన్నాడు. సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏంటని డైరెక్ట్ గా కలవచ్చని అన్నారు.
ఒకప్పుడు వైఎస్ఆర్ తో కొట్లాడి కూడా ఏదైనా అవసరం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళేవారిమని చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్లే పరిస్థితి లేదన్నారు. తనకు పార్టీలు మారే స్వభావం ఉండదని చివరిదాకా టిఆర్ఎస్ లోనే కొనసాగుదాం అనుకున్నానని… కానీ వాళ్లు చెడగొట్టారు అని అన్నారు. తన గెలుపుకు బిజెపి నాయకులు కృషి చేశారని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు తన వెంట ఉన్నారని అన్నారు.