క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా…? చార్జ్ కార్డ్ అని ఒకటి ఉంది తెలుసుకోండి…!

-

భారత్ లో క్రెడిట్ కార్డ్ వినియోగం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రతీ ఒక్కరు కూడా క్రెడిట్ కార్డ్ ని ఒక నిత్యావసరంగా భావిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అది ఎక్కువగా ఉపయోగపడటం, బ్యాంకు లు కూడా వివిధ ఆఫర్లు ఇవ్వడంతో చాలా మంది క్రెడిట్ కార్డు వాడకం విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కూడా అది కాపాడుతుందనే వారు కూడా ఉన్నారు. దాదాపు 50 మిలియన్ల మంది మన దేశంలో క్రెడిట్ కార్డు ని వాడుతున్నారు. క్రమంగా ఈ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.

అయితే క్రెడిట్ కార్డ్ ప్లేస్ లో ఇప్పుడు మరో కార్డు కూడా వచ్చింది. అదే చార్జ్ కార్డ్. ఛార్జ్ కార్డుల‌న్నీ బ్రాండెడ్ కార్డులు. అవి అన్ని పాయింట్ ఆఫ్ సేల్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేల వ‌ద్ద బ్రాండ్‌ల కొనుగోలుకి మాత్రమే అనుమతిస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ కి నెలవారీ ఆదాయానికి మూడు రెట్లు లేదా నాలుగు రెట్లు పరిమితి ఉంటుంది. కాని చార్జ్ కార్డులకు చాలా వరకు ముందస్తు పరిమితి ఉండదు. మీ అవసరాన్ని బట్టి వాటి పరిమితిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అమెరికాను ఎక్స్ప్రెస్ మాత్రమే వీటిని అందిస్తుంది.

అయితే చెల్లింపు విషయంలో మాత్రం చాలా తేడా ఉంటుంది. చార్జ్ కార్డులను ఒక్కసారే చెల్లించాలి, క్రెడిట్ కార్డ్ లో మాత్రం కనీస మొత్తాన్ని చెల్లిస్తూ ఉండాలి. చెల్లింపుల విషయంలో వడ్డీ ఉండదు గాని చార్జీలు మాత్రం విధిస్తారు. ఒకవేళ మీరు గడువు లోగా చెల్లించకపోతే… దానికి 3.5 శాతం నుంచి చార్జీలు విధిస్తారు. మీరు ఎంత ఆలస్యం చేస్తే ఆ చార్జీలు అంతగా పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం వీటిని ఆదాయం ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే వినియోగిస్తున్నారు. అమెరికన్ ఎక్స్ప్రెస్ కూడా వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని ఆఫర్లు ప్రకటిస్తుంది. క్రమంగా వీటి వాడకం పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news