పీఎఫ్ అకౌంట్ లో వడ్డీ పడిందో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

-

ఈపీఎఫ్ఓ ఖాతా బ్యాలెన్స్‌ను ఈజీగా మనం ఇంట్లో వుండే చెక్ చేసుకోచ్చు. దీని కోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. మీరు వివిధ పద్ధతులను ఉపయోగించి డిజిటల్‌గా ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ ని చెక్ చేసుకోచ్చు. ఉమంగ్ యాప్, EPFO వెబ్ సైట్, ఇ-సేవా వెబ్‌సైట్, SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్ ని మనం ఈజీగా చెక్ చేసేయచ్చు.

వెబ్ సైట్ ద్వారా ఇలా బ్యాలెన్స్ చెక్ చేసుకోండి:

epfindia వెబ్సైట్ కి లాగిన్ చేసి, ‘అవర్ సర్వీసెస్’ డ్రాప్‌డౌన్ మెను క్రింద ఉన్న ‘ఉద్యోగుల కోసం’ పై క్లిక్ చేయాలి.
నెక్స్ట్ ఆపై, ‘సర్వీసెస్’ కింద ‘సభ్యుని పాస్‌బుక్’ ని సెలెక్ట్ చెయ్యండి.
మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చెయ్యాలి.
యాక్టివేట్ చేయబడిన యూఏఎన్(UAN) నంబర్ ఉంటేనే అవుతుంది. లేదంటే అవ్వదు.
మీకు UAN లేకపోతే, అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేసి epfoservices.in/epfo/ మీ ఆఫీస్ లింక్‌పై క్లిక్ చేసే ముందు మీ స్థితిని ఎంచుకోండి.
ఖాతా నంబర్, పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి PF బ్యాలెన్స్‌ని చూడచ్చు.

“EPFOHO UAN ENG” అనే టెక్స్ట్‌ను 7738299899కి SMS పంపండి. ‘ENG’ ఇక్కడ మీ ప్రాధాన్యత గల భాషలోని మొదటి మూడు అక్షరాలను సూచిస్తుంది. కనుక భాష బట్టి టైప్ చెయ్యండి. తెలుగులో SMS పొందాలనుకుంటే ‘TEL’ అని టైప్ చెయ్యండి. ఇలా ఎస్సెమ్మెస్ ద్వారా తెలుసుకొచ్చు.

లేదా EPFO సభ్యులు 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారి PF బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version