ఇలా ఈజీగా క్రెడిట్ కార్డు పొందొచ్చు తెలుసా..?

మీరు కొత్తగా క్రెడిట్ కార్డు పొందాలని అనుకుంటున్నారా….? అయితే ఈజీగా పొందొచ్చు. పైగా చాల సులువుగా ఇప్పుడు క్రెడిట్ కార్డుని పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటు లోకి తీసుకు రావడం జరిగింది.

దీనితో కస్టమర్లు బ్యాంక్ నుంచి సులభం గానే క్రెడిట్ కార్డులు పొందొచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే యస్ బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడానికి ట్రాన్స్‌యూనియన్ సొల్యూషన్‌ను అమలు చేయడం జరిగింది.

దీంతో కస్టమర్లు బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు పొందటానికి తక్కువ వివరాలు అందించినా చాలు అని చెప్పడం జరిగింది. క్రెడిట్ కార్డు జారీ ప్రక్రియ మొత్తంతో ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఇంకా ఫిజికల్ డాక్యుమెంట్ల తో పని కూడా లేదు.

ఎక్కడికీ వెళ్లకుండానే, ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లు అందింకుండానే ఇలా క్రెడిట్ కార్డు పొందొచ్చు. డైరెక్ట్ గా క్రెడిట్ కార్డు ఇంటికే వచ్చేస్తుంది.