ఈ యాప్‌తో ట్రాఫిక్ ఫైన్స్‌కు చెక్ పెట్టవ‌చ్చు.. ఎక్క‌డో తెలుసా..

-

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ మ‌రియు ఫైన్స్ క‌ఠినంగా ఉన్నాయి. వాహ‌నానికి సంబంధించి ఏది లేక‌పోయినా భారీ ఫైన్స్ క‌ట్ట‌వ‌ల్సి వ‌స్తుంది. బిజీ లైప్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వాహ‌నానికి సంబంధించి ఏదో ఒక ప‌త్రం మరచిపోతాం. అయితే స్మార్ట్‌ఫోన్స్‌ కాలంలో ఎన్నో పనులు సులభతరమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహన పత్రాలన్నీ ఒకచోట పెట్టుకునేందుకు ఏవైనా యాప్స్‌ ఉంటే బాగుంటుంది కదా! వివిధ పత్రాలు దాచుకునేందుకు ఆన్‌లైన్‌లో కొన్ని యాప్స్‌ సిద్ధంగా ఉన్నాయి.

‘డిజిలాకర్‌, ఎంపరివాహన్‌’ అనే యాప్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్‌ డిజిటల్‌ లాకర్‌ సిస్టమ్‌గా పిలిచే ‘డిజిలాకర్‌’ యాప్‌లో వాహనాలకు సంబంధించిన పత్రాలను భద్రపరుచుకోవచ్చు. అయితే దీనికోసం వాహనదారులు తప్పనిసరిగా డిజిలాకర్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. అందులో తమ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు భద్రపరుచుకోవచ్చు.

హార్డ్‌ కాపీలను చూపించలేనప్పుడు డీజీలాకర్‌ యాప్‌ ద్వారా పత్రాలను చూపించ‌వ‌చ్చు. ట్రాఫిక్‌ పోలీసు అడిగినప్పుడు నేరుగా ఈ యాప్‌ నుంచే సంబంధిత పత్రాలు చూపించి.. జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ రూల్స్ కేవ‌లం బెంగళూరు, కర్ణాటకలో మాత్ర‌మే అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఇలాంటివి అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తే వాహ‌న‌దారుల‌కు ఎంత బాగుంటుందో కదా..!

Read more RELATED
Recommended to you

Latest news