రేష‌న్ కార్డు కోసం అన్ని చోట్ల‌కూ తిర‌గాల్సిన ప‌నిలేదు.. ఆన్‌లైన్‌లో ఈ డాక్యుమెంట్ల‌తో అప్లై చేయ‌వ‌చ్చు..!

దేశంలో ఉన్న పేద‌ల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు గాను కేంద్రం గ‌తంలోనే వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డ్ పేరిట ఓ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చిన విష‌యం విదిత‌మే. దీని వ‌ల్ల దేశంలోని ప్ర‌జ‌లు ఎక్క‌డికి వెళ్లినా రేష‌న్ ను పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. వ‌ల‌స కార్మికులు ఎప్పుడూ ఒక చోట ఉండ‌రు. క‌నుక వారికి రేష‌న్ అంద‌డం ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్మికుల‌ను దృష్టిలో పెట్టుకునే ఈ ప‌థ‌కాన్ని కేంద్రం అమ‌లులోకి తెచ్చింది. అయితే రేష‌న్ కార్డును పొందేందుకు ఎవ‌రైనా స‌రే కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేదు. ఆన్‌లైన్‌లోనే కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

do not go anywhere for ration card apply online with these documents

రేష‌న్ కార్డుల‌ను కొత్త‌గా పొందేందుకు ఆన్‌లైన్‌లో ఆయా రాష్ట్రాలు త‌మ సొంత వెబ్‌సైట్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పౌరులు అయితే https://fcs.up.gov.in/FoodPortal.aspx అనే సైట్‌ను, బీహార్ వాసులు అయితే Hindiyojana.in/apply-ration-card-bihar/ అనే సైట్‌ను, మ‌హారాష్ట్ర అయితే mahafood.gov.in అనే సైట్‌ను ఓపెన్ చేసి రేష‌న్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఇలా ఏ రాష్ట్ర వాసులు ఆ రాష్ట్రానికి చెందిన వెబ్‌సైట్‌లో రేష‌న్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

18 ఏళ్లు నిండిన వారు విడిగా కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అంత‌క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న వారి పేర్లు త‌మ త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుల కార్డుల్లో వ‌స్తాయి. భార‌త పౌరులు ఎవ‌రైనా స‌రే రేష‌న్ కార్డు కోసం అప్లై చేయ‌వ‌చ్చు.

* ఆన్‌లైన్‌లో రేష‌న్ కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసేవారు ఆధార్ కార్డు, ఓట‌ర్ ఐడీ, పాస్ పోర్టు, హెల్త్ కార్డ్‌, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిల్లో దేన్న‌యినా ఐడీ ప్రూఫ్ కింద స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

* రాష్ట్రాల‌ను బ‌ట్టి రేష‌న్ కార్డు ద‌ర‌ఖాస్తు రుసుం రూ.5 నుంచి రూ.45 వ‌ర‌కు ఉంటుంది. అప్లికేష‌న్ ఫామ్‌ను నింపిన త‌రువాత ఆన్‌లైన్‌లోనే స‌బ్‌మిట్ చేయాలి.

* అప్లికేష‌న్‌ను స‌మ‌ర్పించాక ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. అప్లికేష‌న్ స‌రిగ్గా ఉంటే కార్డు జ‌న‌రేట్ అవుతుంది.

* ఇక అడ్ర‌స్ ప్రూఫ్ కోసం విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్‌, టెలిఫోన్ బిల్‌, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్‌, రెంట‌ల్ అగ్రిమెంట్ వంటివి స‌మ‌ర్పించ‌వ‌చ్చు. వీటితోపాటు పాన్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్‌లను కూడా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వాటిని అధికారులు ప‌రిశీలించి రేష‌న్ కార్డులు జారీ చేస్తారు.