హాలీవుడ్ సినిమాలో తెలుగమ్మాయి.. నెట్ ఫ్లిక్స్ చేతికి హక్కులు.

Join Our Community
follow manalokam on social media

శోభిత దూళిపాళ్ళ. గూఢచారి సినిమాలో అడవి శేష్ పక్కన హీరోయిన్ గా నటించిన అచ్చ తెలుగు అమ్మాయికి హాలీవుడ్ అవకాశం వచ్చింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన శోభిత, హిందీలో నటించింది. అటు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీసుల్లోనూ కనిపించిన ఈ అమ్మడుకి తాజాగా హాలీవుడ్ అవకాశం వచ్చేసింది. దేవ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్న మంకీ మాన్ సినిమాలో శోభిత నటిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్త హక్కులని ప్రఖ్యాత ఓటీటీ యాజమాన్యం అయిన నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

30మిలియన్ల డాలర్లకి మంకీ మాన్ సినిమా నెట్ ఫ్లిక్స్ చేతికి వెళ్ళింది. దర్శకుడిగా మొదటి సినిమాకే ఆ రేంజిలో ధర పలకడం దేవ్ పటేల్ అదృష్టమే. మొత్తానికి హాలీవుడ్ తెరపై తెలుగమ్మాయికి మంచి గౌరవం దక్కుతోంది. గూఢచారి తర్వాత శోభిత దూళిపాళ్ళ, మరోసారి మేజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది. జులై 2వ తేదీన మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతుంది.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...