ఇలాంటి స్కాలర్ షిప్పులు కూడా ఉంటాయి.. తెలుసుకోండి..?

-

సాధారణంగా ఉన్నత చదువులు చదివే వారికి అనేక స్కాలర్ షిప్పులు అందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ ఉపకార వేతనాలు అందిస్తాయి. అయితే కళాకారులకు కూడా స్కాలర్ షిప్పులు అందుకునే అవకాశం ఉందని మీకు తెలుసా..?

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ .. సీసీఆర్‌టీ.. ఈ స్కాలర్ షిప్పులు అందిస్తుంది. 2019-20 సంవత్సరానికి పలు కళల్లో ప్రావీణ్యమున్న యువ కళాకారులకు ఉపకారవేతనాలు అందించేందుకు ప్రకటన కూడా వెలువరించింది.

సంప్రదాయ సంగీతం, సంప్రదాయ నృత్యం, నాటకం, మైమ్‌, చిత్ర కళ, జానపదం, లైట్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ వంటి విభాగాల్లో ఈ స్కాలర్ షిప్పులు అందిస్తారు. దీనికింద నెలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ స్కాలర్ షిప్ అందుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి సుమా. సంబంధిత కళలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అందుకు సంబంధించిన శిక్షణా సర్టిఫికెట్‌ ఉండాలి.

ఈ ఏడాది మొత్తం 400 మందికి ఈ స్కాలర్ షిప్ అందిస్తారు. అర్హులను ఎంపిక చేసేందుకు ఇంటర్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థిని తమ కళలను ప్రదర్శించమని అడగవచ్చు. దీనికి ధరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ డిసెంబర్ 5.. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ccrtindia.gov.in వెబ్ సైట్ పరిశీలించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news