జూలై 18 వ తేదీ నుంచి ప్యాకేజ్డ్ వస్తువులు, ఆహార ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ వస్తువుల పై పన్ను ఎత్తి వేత జరుగుతుందని దీని కోసమే జీఎస్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముందుగా ప్యాక్ చేసిన తృణధాన్యాలు, పప్పులు, ఆటా, మజ్జిగ, పెరుగు పనీర్‌లపై 5% GST విధించాలని ఇటీవల నిర్ణయించారు. ఇంతకు ముందు ఈ వస్తువులన్ని జీఎస్టీ పరిధిలోకి వచ్చేవి. ఇటీవల చండీగఢ్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై జీఎస్టీ విధించాలని నిర్ణయించారు..ఈ వస్తువుల పెంపును తీసి వెయ్యాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి..
జీఎస్టీ కౌన్సిల్ సమ్మతితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యదర్శి బజాజ్ తెలిపారు. జీఎస్టీకి సంబంధించిన విషయాలను నిర్ణయించే అత్యున్నత సంస్థ జీఎస్టీ కౌన్సిల్ అని, ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై పన్ను విధించడంపై ఈ కమిటీ ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకుందని చెప్పారు. జీఎస్టీ కమిటీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా ఉంటారు. అయితే, పప్పులు, గోధుమలు, బియ్యం, బార్లీ, మొక్కజొన్న, గోధుమ పిండి, సెమోలినా, శెనగపిండి, ముర్మురా, పెరుగు, లస్సీలను బహిరంగంగా విక్రయించే, ప్యాక్ లేదా లేబుల్ లేకుండా విక్రయించే వాటిపై ఎటువంటి GST వర్తించదన్నారు. జీఎస్‌టి అమలుకు ముందు ఈ నిత్యావసర వస్తువులపై అనేక రాష్ట్రాల్లో పన్ను విధించబడింది. వాటి ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వచ్చేది. జూలై 2017లో ప్రవేశపెట్టిన GST విధానంతో ఈ పద్ధతిని కొనసాగించాలని భావించారు. అయితే నిబంధనలు, సర్క్యులర్‌లు బయటకు రాగానే బ్రాండెడ్ ఉత్పత్తులపై ఈ పన్ను విధించినట్లు చెప్పారు.ప్రముఖ బ్రాండెలు ఈ నిభంధనలను పాటిస్తున్నారని తెలిపారు.