తుమ్మినప్పుడు మనం కళ్ళని ఎందుకు మూసుకుంటామో తెలుసా..?

మనం తుమ్మినప్పుడు కళ్ళని మూసుకోకపోతే కంటి గుడ్లు బయటకి వచ్చేస్తాయని.. తుమ్మినప్పుడు అయితే గుండె ఒక క్షణం ఆగి పోతుందని అంటారు. కానీ ఇందులో నిజం లేదు. మరి ఎందుకు తుమ్మితే కళ్ళు మూసుకుపోతాయి అనేదీ చూస్తే.. ఎప్పుడైనా మనం తుమ్మితే కళ్ళు మూసుకుని తుమ్ముతాము. అయితే ఎందుకు మనం తుమ్మినపుడు కళ్లు మూసుకోవాలి దీని వెనుక ఉండే కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

Closing The Eyes While Sneezing | Interesting Facts for Kids

సాధారణంగా మనం ముక్కు ద్వారా గాలి తీసుకుంటూ ఉంటాం. అయితే గాలిలోని అనవసరమైన బ్యాక్టీరియాలను, క్రిములను అడ్డుకుని మంచి గాలి లోపాలకి వెళ్తుంది. అది ఊపిరితిత్తులకు చేరుతుంది. అయితే సహజంగా మన ముక్కు గాలిని వడకడుతుంది. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు బ్యాక్టీరియా మరియు ఇతర పదార్థాలు లోపలికి వెళ్లే అవకాశం ఉండి.

అలా ఉన్నట్లయితే మెదడుకి ఒక సంకేతం వెళుతుంది. అప్పుడు ఊపిరితిత్తుల నుంచి గాలి వేగంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ముక్కు ద్వారా గాలిని బలవంతంగా బయటకు పంపించడం జరుగుతుంది.

ఇలా ఇంత వేగంతో గాలి బయటకు రావడంతో ప్రతి చర్యగా కళ్ళు మూసుకుంటాయి. అలాంటి మరొక కారణం కూడా ఉంది అదేమిటంటే సైంటిస్ట్ల ప్రకారం మనం తుమ్మినప్పుడు వచ్చే శబ్దం లేదా మలినాలు కళ్ళల్లోకి వెళ్లకుండా ఆపడానికి కళ్ళు వాటంతట అవే మూసుకుపోతాయి అని అంటున్నారు.