ఇక ఎక్కడ ఉన్నా ఓటు వెయ్యొచ్చు…! ఎలా అంటే…?

-

ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళో కూడా పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటెయ్యడం నిజంగా కష్టమైనా పద్దతే. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నా.. ఏ పోలింగ్‌ కేంద్రం నుంచైనా ఓటు వెయ్యచ్చు. దీని కోసం రిమోట్‌ ఓటింగ్‌ విధానాన్ని త్వరలో తీసుకు రానున్నారు. దీని కోసం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా చెప్పడం జరిగింది. అయితే మరి ఈ టెక్నాలజీ విషయం లోకి వస్తే…. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తో ఈ టెక్నాలజీ ముడిపడింది… ఈ విధానాన్ని మద్రాస్-ఐఐటీ తో కలిసి ఎన్నికల సంఘం రూపొందిస్తోంది అని తెలుస్తోంది.

మాజీ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సందీప్‌ సక్సేనా ఏమంటున్నారంటే..? ఈ విధానం వల్ల తమ ఓటు హక్కును వేరే ప్రాంతం లోని ఉండి… వేరే పోలింగ్‌ కేంద్రం నుంచి వినియోగించుకునేందుకు తోడ్పడుతుందని చెప్పారు. కానీ దీనిని ఇంటి నుండి వేయడం కుదరదు అని చెప్పారు. ఇది ఇలా ఉండగా డిజిటల్‌ ఓటరు కార్డుల విధానాన్ని ప్రారంభించినట్టు తెలిసిందే.

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ‌ప్రసాద్‌ సోమవారం ఇ-ఓటరు కార్డులను స్టార్ట్ చేసారు. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వాళ్ళు ఇ-ఓటరు కార్డును మొబైల్స్ ‌లోను, కంప్యూటర్‌ లోను భద్రపరుచుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news