విద్యార్ధులకి తీపికబురు..చౌక వడ్డీకే రుణాలు ఇలా పొందొచ్చు…!

-

విద్యార్ధులకి శుభవార్త. ఉన్నత విద్యని అభ్యసించడానికి ఇబ్బందులుగా ఉందా..? అయితే ఇప్పుడు విద్యార్థులకు చౌక వడ్డీ రేట్లకే ఎడ్యుకేషన్ లోన్స్ అందుబాటు లో వున్నాయి. వీటితో మీరు చౌక వడ్డీ రేట్లకే ఎడ్యుకేషన్ లోన్స్ పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

పలు బ్యాంకులు తక్కువ వడ్డీకే విద్యార్థులకు రుణాలు అందిస్తున్నాయి. అయితే ఎక్కడ తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక వాటి వివరాల లోకి వెళితే… ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా చాల తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ బ్యాంక్‌ లో ఎడ్యుకేషన్ లోన్స్‌ పై వడ్డీ రేటు 6.75 శాతం నుండే స్టార్ట్ అవుతున్నాయి.

అదే విధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకి లోన్ అందిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.8 శాతం వడ్డీ రేటు పడుతుంది. అదే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 6.85 శాతం వడ్డీ రేటు ఉంది.

ఈ లోన్ పై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్‌ తీసుకున్న తర్వాత చెల్లించే వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. పైగా ఆర్ధిక ఇబ్బందుల వలన చదువు ఆపేయక్కర్లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news