పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో గుడ్ న్యూస్..!

-

పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో గుడ్ న్యూస్ చెబుతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO పెన్షనర్ల కోసం కీలక నిర్ణయం చేసుకోనుంది. ఈ నిర్ణయం తీసుకుంటే ఎంతో బెనిఫిట్ గా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి మినిమమ్ పెన్షన్ పెంచాలని అనుకుంటున్నారు.

epf

ఇది కనుక అమలు చేస్తే పీఎఫ్ చందాదారులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే నివేదికలని పరిశీలించి చూస్తినట్టైతే.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశం ఈ నెల లో జరగనుంది. అయితే దీనిలో పెన్షన్ పెంచడం పై చర్చ జరిగేలా కనపడుతోంది. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ మాత్రం కనీస పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

రూ.6 వేలకు పెంచాలని అన్నారు. అయితే ఇప్పుడు అయితే కనీస పెన్షన్ రూ.1000గా ఉంది. అయితే సీబీటీ మాత్రం ఈ కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచే ఛాన్స్ ఉండేలా కనపడుతోంది అని అంది. ఇక ఇది ఇలా ఉండగా ఈ సమావేశం లో ప్రైవేట్ కార్పొరేటు బాండ్ల లో ఈపీఎఫ్‌వో ఇన్వెస్ట్‌మెంట్ల గురించి మరియు వడ్డీ రేటు పై కూడా చర్చించనున్నారు. ఆ తరవాత ఏమైనా మార్పు ఉంటే చేయడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news