రూ.లక్షకు ఐదు లక్షలు లాభం… వివరాలు ఇవే…!

Join Our Community
follow manalokam on social media

మీరు అదిరిపోయే రాబడి పొందాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ELSS గురించి చాల మందికి తెలిసినదే..! చాల మంది ఇందులో డబ్బులు పెట్టి సూపర్ బెనిఫిట్స్ ని పొందుతారు. మీరు కూడా ఇందులో డబ్బు పెట్టాలనుకుంటున్నారా….? అయితే మంచిదే. ఇందులో డబ్బులని పెట్టడం వలన పన్ను ఆదా తో పాటు మంచి రాబడి కూడా వస్తుంది. ఈఎల్ఎస్ఎస్ అన్నింటికి ఆనువుగానే ఉంటుంది.

ఇది ఇలా ఉండగా దీనిలో కనుక డబ్బులు పెడితే లాభం ఏమిటి…?, ఎంత లాభం వస్తుంది..? అనే విషయానికి వస్తే… ఈఎల్ఎస్ఎస్‌లో మీరు డబ్బులు పెట్టడం వల్ల ప్రతి ఏడాది రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా అవుతుంది. ఈఎల్ఎస్ఎస్ పదేళ్ల సగటు రాబడి 13 శాతానికి పైగానే ఉంది. అలానే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ పదేళ్ల రాబడి 18.64 శాతంగా ఉంది. మీరు రూ.లక్ష కనుక ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.5.5 లక్షలు అయ్యి ఉండేది. అలాగే ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్ కూడా 15.6 శాతం రాబడి అందించింది. అంటే మీకు దీనితో రూ.లక్ష పెట్టి ఉంటే రూ.4.2 లక్షలు వచ్చేవి.

ఇది ఇలా ఉండగా డీఎస్‌పీ ట్యాక్స్ సేవర్ ఫండ్ కూడా పదేళ్లలో 15.43 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. దీనితో మీరు రూ.లక్ష పెట్టి ఉంటే రూ.4.2 లక్షలు వచ్చేవి. అలానే బీఎన్‌పీ పారిబాస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ రాబడి 15.28 శాతం పైనే ఉంది కనుక రూ.లక్ష పెట్టి ఉంటే రూ.4.15 లక్షలు వస్తుంది. అదే కనుక ఐడీఎఫ్‌సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ లో పెడితే కూడా మంచి లాభం వచ్చేసి. ఇది 15.05 శాతం రాబడి అందించింది. దీనిలో మీరు రూ.లక్ష పెట్టి ఉంటే రూ.4.06 లక్షలు వచ్చేవి.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...