ఇలాంటి పాన్ కార్డు ఉంటే జరిమానా తప్పదు..!

-

ఆధార్ కార్డు లాగ పాన్ కార్డు కూడా చాలా ముఖ్యమైనది. ప్రతీ ఒక్కరికీ కూడా పాన్ కార్డు ఉండాలి. దీని వలన చాలా ఉపయోగాలు వున్నాయి. అయితే పాన్ కార్డు వున్నా ప్రతీ ఒక్కరూ కూడా ఆధార్ కార్డు తో లింక్ చేసుకోవాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

పాన్ కార్డు ని ఆధార్ కార్డు తో లింక్ చెయ్యడానికి 2022 మార్చి 31 వరకు ఇందుకు గడువు ఉంది. ఈలోపు మీరు పాన్ కార్డు ని ఆధార్ తో లింక్ చెయ్యడం మరచిపోకండి. గడువు దాటాక ముందే లింక్ చేసుకోవాలి. లేదంటే పాన్ కార్డు చెల్లదు అని గమనించండి. ఒకవేళ లింక్ చెయ్యలేదు అంటే మ్యూచువల్ ఫండ్స్‌, స్టాక్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యడం కుదరదు.

అలానే బ్యాంక్ ఖాతా ని కూడా తెరవలేరు. పైగా పలు సమస్యలు కూడా రావచ్చు. అందుకే గడువు దాటకుండా లింక్ చెయ్యండి. పైగా మీరు కనుక పాన్ కార్డు ని ఆధార్ తో లింక్ చెయ్యడం మరచిపోయారంటే రూ.10 వేల వరకు జరిమనా పడే అవకాశం ఉంది.

డీయాక్టివేట్ అయిన పాన్ కార్డును ఉపయోగించడం చట్ట విరుద్ధం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272ఎన్ కింద అసెసింగ్ ఆఫీసర్ మీకు రూ.10 వేల వరకు జరిమానా పడుతుంది. కాబట్టి ఇన్ని నష్టాలు ఎదురవుతాయి కనుక లింక్ చేయడం లో అశ్రద్ధ చూపద్దు. అయితే లింక్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ స్టెప్స్ ని ఫాలో అయ్యి లింక్ చేసుకోచ్చు.

ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌ ని ఓపెన్ చెయ్యండి.
పాన్ ఆధార్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇలా వివరాలు ఎంటర్ చేసేయండి.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
ఇప్పుడు లింక్ ఆధార్ బటన్‌పై క్లిక్ చేయాలి.
అంతే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news