ఫామ్ 26 ఏఎస్ వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా..?

-

ఫామ్ 26 ఏఎస్ గురించి పన్ను చెల్లించే వారికి తెలుస్తుంది. మీరు పన్ను చెల్లిస్తున్నారా? అయితే మీకు కూడా ఫామ్ 26 ఏఎస్ గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఫామ్ 26 ఏఎస్ గురించి మరెంత క్లుప్తంగా తెలుసుకోండి. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు కూడ ఉన్నాయి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… ఐటీఆర్ దాఖలుకు ఈ ఫామ్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో పలు రకాల ఫామ్స్ కూడా అవసరం అవుతాయి అన్న సంగతి తెలిసినదే. అయితే ఫామ్ 26 ఏఎస్ ద్వారా టీడీఎస్ ఎంత కట్ అవుతోందో మనం తెలుసుకోవచ్చు.

ఇలా దీని ఆధారంగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వద్ద ఎంత టీడీఎస్ డిపాజిట్ అయ్యిందో మనం తెలుసుకోచ్చు. అలానే పన్ను తక్కువగా కనిపిస్తుంది. ఫామ్ 26 ఏఎస్ లో ఏం ఉంటాయి అనే విషయానికి వస్తే… మీ ఆదాయం సోర్స్, టీడీఎస్ కటింగ్ వంటి వివరాలు ఇందులో ఉంటాయి. మీరు దీనిని ప్రతీ ఏడాది కూడా పొందొచ్చు.

దీన్ని ట్యాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్ అని కూడా పిలుస్తారు. అలానే శాలరీ, రెంట్, డిపాజిట్లపై వడ్డీ వగైరా వాటి పై టీడీఎస్ కట్ అయితే అవి కూడా దీనిలో ఉంటాయి. http://contents.tdscpc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫామ్ 26 ఏఎస్ పొందొచ్చు. ఫామ్ 26 ఏఎస్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు సమయం లో బాగా ఉపయోగపడుతుంది. అలానే ట్యాక్స్ లెక్క పెట్టడం కూడా చాల సులభం అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news