ప్రతీ నెలా జీతం తీసుకునే వారి కోసం ఫైనాన్షియల్ టిప్స్.. వీటిని ఫాలో అయితే సమస్యలే రావు..!

-

ప్రతి నెల జీతం తీసుకునే వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. వచ్చిన జీతాన్ని మనకు నచ్చినట్లు ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత తినడానికి డబ్బులు కూడా ఉండవు. పెద్ద మొత్తంలో ఖర్చులు ఒక్కోసారి ఎదురవుతూ ఉంటాయి. కానీ అంతటి పరిస్థితి రాకుండా ముందు నుండి సేవ్ చేసుకోవడం లాంటివి చేయాలి. పైగా కొన్ని కొన్ని సార్లు లోన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఏది ఏమైనా ఈ జాగ్రత్తలు తీసుకుంటే డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. పైగా ఇబ్బందులు ఉండవు.

అనవసర ఖర్చులు చెయ్యద్దు:

చాలా మంది అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు. దానివల్ల నష్టం మీకే. వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ముఖ్యమైన పనుల కోసం ముందే డబ్బులు పక్కన పెట్టుకోవాలి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది.

క్రెడిట్ కార్డ్:

చాలామంది డబ్బులు అయిపోతే క్రెడిట్ కార్డు తోనే ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే దీనిని సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం. లేదంటే అప్పుల్లో కూరుకు పోతారు.

చిన్న లోన్స్ చెల్లించడం:

మీరు చాలా లోన్స్ తీసుకున్నట్లయితే ముందు చిన్న చిన్న లోన్స్ ని చెల్లించండి. ఇలా చేయడం వల్ల భారం తగ్గుతుంది.

సమయానికి ముందే లోన్ పే చేయండి:

ఏదైనా చెల్లించడానికి ఆఖరి తేదీ వరకు ఉండద్దు. అలా ఎదురు చూస్తే మరో విధంగా డబ్బు ఖర్చు అయిపోతుంది. కాబట్టి సమయానికి ముందే చెల్లించండి.

లోన్ చెల్లించడానికి బడ్జెట్ వేయండి:

మీరు ఎక్కువ లోన్స్ తీసుకున్నట్లయితే ముందుగా ప్రత్యేక బడ్జెట్ ని రెడీ చేసుకోండి ఎక్స్ట్రా డబ్బులు ఉన్నప్పుడు వాటిని చెల్లించడానికి ప్రిఫర్ చేయండి. ఇలా చేయడం వల్ల డబ్బులు మీ దగ్గర ఉంటాయి అలానే మీరు కష్టాలు లో కూరుకుపోకుండా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news