తెలంగాణలో మృత్యుంజయ హోమాలు.. మోదీ కోసం బీజేపీ నేతల సంకల్పం

-

నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నారు నేతలు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని మృత్యుంజయ హోమం నిర్వహిస్తుంది తెలంగాణ బీజేపీ పార్టీ. మండల.. జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నారు నేతలు.

అటు హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో బండి సంజయ్ పాల్గొననున్నారు. అలాగే పంజాబ్ లో మోదీ కాన్వాయ్ ని అడ్డుకోవడంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనునంది బీజేపీ. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మౌనదీక్షలు నిర్వహించనున్నారు నేతలు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌనదీక్ష చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో నిర్వహించే మౌనదీక్ష లో బండి సంజయ్ పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news