ఈరోజుల్లో ఎవరూ కూడా క్యాష్ తీసుకు వెళ్లట్లేదు. ప్రతీ ఒక్కరు కూడా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. మీరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి. ఇలా చేశారంటే మీరు చాలా సేఫ్ గా ఉంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దాదాపు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం ఉండడం వలన డిజిటల్ పేమెంట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆన్లైన్ పేమెంట్స్ సంఖ్య కూడా పెరిగిపోయింది. డిజిటల్ పేమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని ఇవ్వకండి
కస్టమర్లని ఆకట్టుకోవడానికి ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ కొనుగోళ్లపై ఆఫర్స్ ని డిస్కౌంట్స్ ని ప్రకటిస్తాయి. దీంతో ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ బాగా పెరిగిపోయింది. పేమెంట్ చేసేటప్పుడు పిన్ నెంబర్, పాస్వర్డ్ వంటి వివరాలు ఎవరూ అడగరు. ఒకవేళ ఏదైనా ప్లాట్ ఫామ్ లో అలాంటి సమాచారం అడిగినట్లయితే వాటిని ఇవ్వకుండా జాగ్రత్త పడండి.
సెక్యూరిటీ పేమెంట్ ప్లాట్ఫారం
పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ చేస్తున్న వెబ్సైట్ కి రిప్యుటేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వెబ్సైట్లో HTTPS వెరిఫైడ్ పేమెంట్ సింబల్ ని చెక్ చేసుకోండి.
కంపెనీ సమాచారం
డిజిటల్ పేమెంట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపూరిత పేమెంట్ రిక్వెస్ట్ ని ఒక్కోసారి పంపుతారు. మిమ్మల్ని నమ్మించడానికి సంబంధించిన ఇన్వాయిస్ కూడా పంపిస్తారు. కాబట్టి కంపెనీ సమాచారాన్ని పక్కా మీరు తెలుసుకోవాలి.
సురక్షితంగా ఉందా లేదా చూసుకోండి
ఏదైనా లింక్ లేదా యాప్ డిజిటల్ పేమెంట్ చేస్తున్నప్పుడు ఆ ప్లాట్ఫారం సురక్షితమైనదా కాదా అనేది మీరు చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే పేమెంట్ చేయాలి. లేదంటే అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది.
తొందర పడొద్దు
ఆన్లైన్ పేమెంట్ మోసాల్లో కేటుగాళ్లు విభిన్న పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. లింక్ పంపి వెంటనే పేమెంట్ చేయాలి అని కోరుకుంటారు. లిమిట్ ఆఫర్ అని త్వరగా ముగిసిపోతుందని తొందర పెడుతుంటారు. అలాంటప్పుడు తొందరపడకుండా చూసుకోవాలి.