10వ త‌ర‌గ‌తి పాస్ అయ్యారా..? ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి క‌ల్పిస్తారు..!

-

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఉన్న భూదాన్ పోచంప‌ల్లి మండ‌లం జ‌లాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ రూర‌ల్ ఇనిస్టిట్యూట్‌లో నిరుద్యోగ గ్రామీణ యువ‌త‌కు ఉచిత భోజ‌న వ‌స‌తితో కూడిన శిక్ష‌ణను అందివ్వ‌నున్నారు. శిక్ష‌ణ అనంత‌రం యువ‌త‌కు ప‌లు సంస్థ‌ల్లో ఉపాధి అవ‌కాశాలు కూడా క‌ల్పించ‌నున్నారు. దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్య యోజ‌న (భార‌త ప్ర‌భుత్వం) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించనున్న ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌కు అర్హ‌త ఉన్న, ఆస‌క్తి గ‌ల గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన నిరుద్యోగుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు.

అందుబాటులో ఉన్న శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు…

1. ఆటోమొబైల్ (2, 3 వీల‌ర్ స‌ర్వీసింగ్‌) – కాల ప‌రిమితి 3 నెల‌లు – అర్హ‌త 10వ త‌ర‌గ‌తి పాస్
2. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల రిపేర్‌, మెయింటెనెన్స్ (సెల్‌ఫోన్‌తో స‌హా) – కాల ప‌రిమితి 3 నెల‌లు – అర్హ‌త 10వ త‌ర‌గ‌తి పాస్
3. ఎల‌క్ట్రిషియ‌న్ (డొమెస్టిక్‌) – కాల‌ప‌రిమితి 4 నెల‌లు – అర్హ‌త 10వ త‌ర‌గ‌తి పాస్
4. డీటీపీ, ప్రింట్ ప‌బ్లిషింగ్ అసిస్టెంట్ – కాల‌ప‌రిమితి 4 నెల‌లు – అర్హత 10వ త‌ర‌గ‌తి పాస్
5. అకౌంట్స్ అసిస్టెంట్ (టాలీ) – కాల‌ప‌రిమితి 3 నెల‌లు – బీకామ్‌ పాస్
6. కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్ – కాల‌ప‌రిమితి 3 నెల‌లు – ఇంట‌ర్‌ పాస్
7. సోలాస్ సిస్ట‌మ్ ఇన్‌స్టలేష‌న్‌, స‌ర్వీస్ – కాల‌ప‌రిమితి 3 నెల‌లు – ఇంట‌ర్/ఐటీఐ పాస్
8. కుట్టు మెషిన్ ఆప‌రేట‌ర్ (టైల‌రింగ్‌) – కాల‌ప‌రిమితి 3 నెల‌లు – 7వ త‌ర‌గ‌తి పాస్/ఫెయిల్‌

పైన తెలిపిన కోర్సుల్లో చేరేందుకు అభ్య‌ర్థుల‌కు వ‌య‌స్సు 18 నుంచి 35 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. క‌చ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సిస్తున్న వారు అయి ఉండాలి. చ‌దువు మ‌ధ్య‌లో ఉన్న‌వారు అర్హులు కారు. ఇదివ‌ర‌కే ఆర్‌వైకే, రోషిణి, డీడీయూజీకేవై ప‌థ‌కాల ద్వారా శిక్ష‌ణ పొందిన వారు అర్హులు కారు. అలాగే శిక్ష‌ణ అనంత‌రం ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. శిక్ష‌ణ పొందాక అభ్య‌ర్థులు నెల‌కు రూ.6 వేల నుంచి రూ.8వేల జీతం పొంద‌వ‌చ్చు. ఆరు నెల‌లు లేదా సంవత్స‌రం త‌రువాత జీతం పెంచుతారు.

కావ‌ల్సిన ప‌త్రాలు…

1. విద్యార్హ‌త‌ల ఒరిజిన‌ల్ సర్టిఫికెట్స్‌, జిరాక్స్ కాపీలు
2. పాస్ పోర్టు సైజ్ ఫొటోలు
3. ఆధార్ కార్డు
4. రేష‌న్ కార్డు

శిక్ష‌ణ‌కు ఎంపికైన విద్యార్థులు రూ.250 రీఫండ‌బుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని ఉచితంగా అందిస్తారు. ఉచిత హాస్ట‌ల్‌, భోజ‌న వ‌స‌తి క‌ల్పిస్తారు. శిక్ష‌ణ అనంత‌రం ఉద్యోగం క‌ల్పిస్తారు. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈ నెల 16వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు సంస్థ‌లో హాజ‌రు కావాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు 9133908111, 9133908222, 9948466111 ఫోన్ నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version