అమెజాన్ నుంచి ఫ్రీ క్రెడిట్ కార్డు.. ఉపయోగాలు ఏంటంటే..?!

-

కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలని ఆలోచన ఉన్నవారికి ఒక బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా మీకు ఫ్రీగా క్రెడిట్ కార్డు, ఎటువంటి డబ్బులు చెల్లించకుండా లభించనుంది. ఇంకా వీటి పై పలు ఆఫర్లు కూడా పొందొచ్చు. ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం రోజురోజుకి బాగా పెరిగిపోతోంది. క్రెడిట్ కార్డుల వల్ల కలిగే అనేక లాభాలే ఇందుకు ముఖ్య కారణం. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్, రివార్డు పాయింట్లు, నో కాస్ట్ ఈఎంఐ.. ఇలా క్రెడిట్ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. దాదాపు అన్ని బ్యాంకులు వారి కస్టమర్లకు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి.వీటిల్లో ఏ కార్డు తీసుకోవాలో కూడా చాలా మందికి తెలిసి ఉండదు. అయితే మీ అవసరం ప్రాతిపదికన కార్డును ఎంచుకోవడం మంచిది.

Amazon-Pay-ICICI-Bank-Credit-Card

ప్రస్తుతం ఒక క్రెడిట్ కార్డుకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. అదే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. దేశంలో అతి కొద్దీ కాలంలో 10 లక్షల మార్క్‌ను దాటేసిన క్రెడిట్ కార్డుగా ఇది కొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే 10 లక్షల మంది వినియోగదారులు ఈ కార్డును ఉపయోగిస్తున్నారు. జారీ చేసిన 20 నెలలలోపే ఈ క్రెడిట్ కార్డు ఈ రికార్డు సాధించడం గమనార్హం. అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ క్రెడిట్ కార్డుకు ఆన్‌లైన్‌ లోనే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న కొద్దీ రోజుల్లోనే బ్యాంక్ నుంచి ఈ కార్డు మీ ఇంటికి వస్తుంది. ఈ కార్డుపై 3 నుంచి 5 శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి.

బిల్లు పేమెంట్స్, రీచార్జ్, టికెట్ బుకింగ్ వంటి వాటిపై కూడా ఆఫర్లు ఉంటాయి. ఒక రివార్డు పాయింటు ఒక రూపాయికి సమానం. రివార్డు పాయింట్లు ఎప్పటికీ ఎక్స్‌పైరీ అవ్వవు. రివార్డు పాయింట్లు ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేయొచ్చు. రివార్డు పాయింట్లు ప్రతి నెలా మీ అకౌంట్‌కు జమవుతూ ఉంటాయి. మీరు కూడా ఈ కార్డు పొందాలని అనుకుంటే వెంటనే అమెజాన్ వెబ్‌ సైట్‌ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజులు లేకుండా ఫ్రీగానే కార్డు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news