ఆ రెండు దేశాల్లో ఉదృతంగా కరోనా సెకండ్ వేవ్ …!

-

అనుకున్నదే జరిగింది..! యూరప్‌ కంట్రీస్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉంది. మహమ్మారి రెండో దెబ్బకి ఫ్రాన్స్‌, జర్మనీ మళ్లీ లాక్‌డౌన్‌ను ప్రకటించాయ్‌. మరి కొన్ని యూరప్‌ దేశాలు కూడా లాక్‌డౌన్‌ వైపు అడుగులు వేస్తున్నాయ్‌. ప్రపంచాన్ని కరోనా పట్టిపీడుస్తోంది. భారత్ సహా కొన్ని దేశాలు కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాయి. కానీ, ఆ రెండు దేశాల్లో మాత్రం కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువైంది. ఉన్నట్టుండి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు నిండిపోయాయి.. కరోనా మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆ రెండు దేశాలే ఫ్రాన్స్‌, జర్మనీ. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరగడంతో ఫ్రాన్స్‌, జర్మనీ లాక్‌డౌన్‌ను ప్రకటించాయ్‌.

మహమ్మారి కరోనా అత్యంత ప్రభావిత దేశాల్లో ఫ్రాన్స్‌ ఒకటి. అలాంటి దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకి కేసులు భారీగా పెరుగుతున్నాయ్‌. మరణాలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయ్‌. గత 24 గంటల్లో ఈ యూరప్‌ దేశంలో కొత్తగా 244 కరోనా మరణాలు సంభవించాయి. 36 వేల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు డిసెంబరు 1 వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రకటించారు. జర్మనీలో కూడా రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయ్‌. కొత్తగా 14 వేల కేసులు నమోదయ్యాయ్‌. దీంతో నవంబర్‌ 2 నుంచి కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news