ఉచితంగా పాన్‌కార్డు! ఇంట్లో కూర్చొని 5 నిమిషాల్లో పొందండి!

-

ఆదాయపు పన్ను, బ్యాంకులకు ఇలా ప్రతిదానికి పాన్‌కార్డు తప్పనిసరి అనే విషయం తెలిసిందే. కొన్నింటికి అయితే ఫోటో గుర్తింపునకు కూడా !‌ మస్ట్‌ అయింది. దాదాపు అందరూ అందుకే ఆధార్‌ కార్డు తర్వాత ఈ కార్డునే తీసుకొంటారు. ఒకవేళ మీకు పాన్‌కార్డు లేనట్టయితే, పాన్‌ కార్డు తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కేవలం నిమిషాల వ్యవధిలో పాన్‌ కార్డు పొందవచ్చు అదికూడా మీరు దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే ఆన్ లైన్లోనే పాన్‌ కార్డు పొందొచ్చు.
కీలకమైన డాక్యుమెంట్లలో పాన్‌ కార్డు కూడా ఒకటి. బ్యాంకింగ్‌ సహా ఇతర ఆర్థిక లావాదేవీలకు పాన్‌ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అందువల్ల మీ వద్ద పాన్‌ కార్డు లేకపోతే వెంటనే తీసుకోండి. పాన్‌ కార్డు తీసుకోవడం ఇక చాలా సులభం.

ఇప్పుడు మీరు కూడా పాన్‌ కార్డు తీసుకోవాలని యోచిస్తున్నారా? అయితే మీరు వెంటనే పాన్‌ కార్డు ఎలా పొందొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ ఇన్‌ స్టంట్‌ పాన్‌ త్రూ ఆధార్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు గెట్‌ న్యూ పాన్‌ కార్డు అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • ఇక్కడ మీ ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత ఓటీపీ కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత మీకు ఇపాన్‌ కార్డు జారీ అవుతుంది. ఇందంతా 5 నిమిషాల్లోనే జరిగిపోతుంది. అందువల్ల పాన్‌ కార్డు కావాల్సి వస్తే వెంటనే పొందండి.

ఈ పాన్‌ కార్డు అనేది పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ఉంటుంది. మీరు ఈ ఫైల్‌ ఓపెన్‌ చేసి పాన్‌ కార్డు ప్రింట్‌ తీసుకోవచ్చు. లేదంటే అలాగే ఫోన్‌ లో సేవ్‌ చేసుకోవచ్చు. పాన్‌ కార్డు అవసరం అయినప్పుడు ప్రింట్‌ తీసుకొని ఇస్తే సరిపోతుంది. ఇకపోతే మీరు పాన్‌ కార్డు పొందేందుకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. కè ంగా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అందుబాటులో ఉంచింది. ఇక నో బ్రోకరేజీ, నో ఎక్కువ రోజులు వెయిటింగ్‌. ఇలా కూర్చున్న ప్లేస్‌ నుంచే ఆన్‌లైన్‌లో పాన్‌కార్డును సులభంగా పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news