గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ధరల విషయంలో ఊరట..!

-

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట కలిగించే విషయం చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచకుండా స్థిరంగానే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వారందరికీ ఒకటో తేదీన ఊరట కలిగించే వార్త నిచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఒక శుభవార్త అందించింది. ఈసారి కూడా గ్యాస్ సిలిండర్ రేట్లను స్థిరంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది.

గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతాయని చాలా మంది అంచనా వేశారు. కానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ఈ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ రేట్లను నిలకడగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికి ఇది ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ వంటి కంపెనీలు గత నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. కానీ, 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం పెరిగింది. ఈ సిలిండర్ ధర రూ.78 వరకు పైకి కదిలింది. గ్యాస్ సిలిండర్ ధర జూలైలో రూ.4, జూన్‌లో రూ.11 చొప్పున పెరుగుతూ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. మే నెలలో సిలిండర్ ధర ఏకంగా రూ.162 తగ్గింది.

తాజాగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఒకసారి గమనిస్తే, ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.594 గా ఉంది. ముంబైలో కూడా సిలిండర్ ధర రూ.594 ఉండగా. చెన్నైలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.610 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.620గా ఉంది. ఇకపోతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారు ఒక ముఖ్య విషయం గుర్తించుకోవాలి. ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ మారిపోయింది. అలాగే ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్త మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని డెలివరీ బాయ్‌కు చెబితేనే మీకు సిలిండర్ ఇస్తారు. లేదంటే లేదు.

Read more RELATED
Recommended to you

Latest news