సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వద్ద హైటెన్షన్.. భారీ ఎత్తున పోలీసులు !

సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న బీజేపీ కార్యాలయం ముందు శ్రీనివాస్ అనే కార్యకర్త ఆత్మహత్యా యత్నం చేసిన సంగతి విదితమే. మొన్న సిద్ధిపేటలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, అలానే ఆయన మీద పోలీసుల దురుసు ప్రవర్తనకు నిరసనగా ఒంటి పై పెట్రోల్ పోసుకొని శ్రీనివాస్ అనే కార్యకర్త నిప్పు పెట్టుకున్నారు.

yashoda
yashoda

శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏ క్షణం ఏమయినా జరగవచ్చని అంటున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రోగులు సహా ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించి పోలీసులు లోపలకి అనుమతిస్తున్నారు.