కారు లోన్ తీసుకుంటున్నారా…? అలా మాత్రం అసలు చేయవద్దు…!

-

సాధారణంగా గతంలో కారు అనేది ఊరికి ఒకటో రెండో ఉండేవి. ఈ రోజుల్లో ట్రెండ్ మారింది కాబట్టి ఒకరో ఇద్దరికో కారు ఉండటం లేదు అంతే. ఆర్ధికంగా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా కారు కొనుక్కోవడానికి అప్పులు చేసే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. దీనికి తోడు బ్యాంకు లోన్లు కూడా ఆ విధంగానే ఇవ్వడంతో అప్పు చేయడానికి వెనకడుగు వేయడం లేదు. బ్యాంకు లోన్ తక్కువ వడ్డీకి వస్తుంది అంటే చాలు,

కారు కొనడానికి ఎగబడిపోతూ ఉంటారు జనం. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం కారు లోన్ విషయంలో తీసుకోవాల్సి ఉంటుంది. కారు కొనే ముందు ఒక విషయాన్నీ గుర్తుపెట్టుకోండి. కారు అనేది తరుగుదల ఆస్తి. పేరు ఎంత గొప్పది అయినా సరే రోజులు గడిచే కొద్దీ దాని విలువ తగ్గడమే. కాబట్టి లోన్ తీసుకునేలా ఉంటే మాత్రం తక్కువ ధర కారే కొనుక్కోవడం ఎంత అయినా మంచిది.

వాయిదాల విషయానికి వస్తే, అంటే ఈఎంఐలు… కొన్ని బాంక్ లు 5 నుంచి 7 ఏళ్ళ పాటు రుణ పరిమితి ఇస్తున్నాయి. వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి మీరు 7 ఏళ్ళు పెట్టుకుంటే వడ్డీ భారీగా పడుతుంది. అయితే తక్కువ ఈఎంఐ ఉంటుంది. తక్కువ వడ్డీ పడాలి అంటే నెల నెలా ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. అసలు కార్ లోన్ అనేది అనవసరమైన వ్యవహారం. డబ్బు వృధా సమయం వృధా అని అంటున్నారు నిపుణులు.

అదే విధంగా రుణ మొత్తానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి. ఉదాహరణకు కొందరు రుణదాతలు కారు ఎక్స్-షోరూమ్ ధరకు సమానంగా రుణాన్ని అందిస్తుండగా, మరికొందరు 80 శాతం వరకు మాత్రమే రుణాన్ని మంజూరు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కారు మార్కెట్ లోకి వస్తూనే ఉంటుంది కాబట్టి ఒక కారు మీద ఎక్కువ మొత్తం వెచ్చించి కొనాల్సిన అవసర౦ ఉందా అనే ప్రశ్న వినపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news