ESIC లబ్ధిదారులకు శుభవార్త…

-

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC అందించే వైద్య సదుపాయాల కోసం ఇక నుండి ఇబ్బంది పడక్కర్లేదు. పది కిలో మీటర్ల దూరం లో ఉన్న ఆస్పత్రికి వెళ్లి మెడికల్ అడ్వైస్ తీసుకోవచ్చు. ఈ ఫెసిలిటీని ESIC ప్రారంభించింది. కొత్త ఆసుపత్రులని ప్రవేశ పెట్టడం ద్వారా సర్వీసులు ఇవ్వొచ్చని ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 183 వ మీటింగ్ లో సంతోష్ కుమార్ గంగ్వార్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యం లో అవసరమైన వాటి కోసం చర్చించడం జరిగింది.

ఇలా తగిన నిర్ణయాలు తీసుకున్నారు. మినిస్టరీ ఆఫ్ లేబర్ ఇష్యూ చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఆసుపత్రి కోసం ఇబ్బంది పడక్కర్లేదు అని భవిష్యత్తు లో మరి కొన్ని ఆసుపత్రులని నిర్మించాలని అనుకున్నారు. అయితే ఎంప్లాయిస్ మరియు వర్కర్ల డిమాండ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఎంప్లాయిస్ కి వర్కర్స్ కి కూడా బెనిఫిట్ కలుగుతుంది.

బెనిఫిషరీస్ కి పది కిలో మీటర్ల దూరం లో ESIC ఫెసిలిటీస్ అందకపోతే ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి మెడికల్ సర్వీస్ తీసుకోవచ్చు. అయితే వీళ్ళు ESIC హాస్పిటల్ నుంచి రిఫరల్ తీసుకోవాలి లేదా డిస్పెన్సరీ తీసుకోవాలి. ఇది ఇలా ఉంటే కొన్ని కొన్ని సార్లు ఎమర్జెన్సీ సర్వీసులు అవసరం పడతాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ లాంటివి వస్తే వెంటనే ట్రీట్మెంట్ అవసరం. ఈ కారణాలను దృష్టి లో పెట్టుకుని ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ సర్వీసుల్ని స్టార్ట్ చేయాలని అనుకుంటోంది కార్డియాలజీ, యూరాలజీ మరియు ఆంకాలజీ వంటి వాటిని ఢిల్లీ ఎన్సీఆర్ లో ప్రారంభించాలని అంటోంది

Read more RELATED
Recommended to you

Latest news