గర్భిణీలకు ఈఎస్ఐ గుడ్ న్యూస్!

-

ఈఎస్ఐ.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ వేతనం పొందుతున్న వారికీ ఈఎస్ఐ వల్ల పలు ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్న సంగతి విదితమే. ఇంకా తాజాగా ఈఎస్ఐ తన సబ్‌స్క్రైబర్లకు శుభవార్త చెప్పింది. దీంతో చాలా మందికి ప్రయోజనం లభించనుంది.

ESIC increases monetary grant paid to pregnant women to Rs 7,500
ESIC increases monetary grant paid to pregnant women to Rs 7,500

ఈఎస్ఐ తాజాగా గర్భిణీ స్త్రీలకు కన్ఫైన్మెంట్ ఖర్చులను పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ.2,500 నుంచి రూ.7,500కు పెంచుతూ ఈఎస్ఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ ఆస్పత్రిలో కాకుండా ఇతర ఆస్పత్రిలో వెళ్లి వైద్యం చేయించుకోవాలి అనుకునే వారికీ ఈ డబ్బులు ఇవ్వనున్నారు.

అయితే గర్భిణీ స్త్రీలు రూ.7,500 పరిహారం పొందాలంటే ఈఎస్ఐసీ డిస్పెన్సరీల నుంచి మరే ఇతర మెటర్నిటీ సర్వీసులు పొందకూడదు. అలాంటి వారికీ మాత్రమే రూ.7,500 డబ్బులు అందిస్తారు. అయితే ఇలా పరిహారం పెంచడానికి కారణంగా ప్రస్తుతం జీవన వ్యయం పెరుగుదల నేపథ్యంలో కన్ఫిన్మెంట్ ఖర్చులు పెరగడమే. అందుకే ప్రస్తుతం ఉన్న వ్యయాన్ని రూ.7,500 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news