అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…!

రైతులకి జగన్ సర్కార్, మోడీ సర్కార్ తీపి కబురు అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

 

కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. బ్యాంక్ ఖాతాల్లో రూ.2 వేలు రూపాయలని మోదీ సర్కార్ రైతులకి ఇవ్వగా… రైతు భరోసా కింద అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం రూ.5,500 అందిస్తుంది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద మోదీ సర్కార్ ఈ డబ్బులు అన్నదాతలకి ఇవ్వనుంది. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు మే 14న రైతుల బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ అవుతాయి. అదే విధంగా ఈ డబ్బుల కంటే ముందే వైఎస్ జగన్ కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

రైతులకి ఏపీ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వేయనుంది. మే 13న అంటే ఈరోజు ఈ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి చేరుతాయి. ఈ స్కిం కింద అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం రూ.5,500 అందిస్తుంది. దీనితో మే 13న జగన్ ప్రభుత్వం రూ.5,500 రైతుల బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేస్తే…

మే 14న మోదీ అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో కేంద్రం నుండి రూ.2 వేలు జమ చేస్తారు. ఇలా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో వరుసగా రెండు రోజులు డబ్బులు జమ కానున్నాయి.