బ్యాంక్ ఖాతాని తెరవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్…!

-

మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలని అనుకుంటున్నారా..? కానీ ఆఫీసు లేదా ఇంటి పనుల వల్ల కుదరడం లేదా..? అయితే ఇక నుండి మీ ఇంట్లో నుండి లేదా ఆఫీసు నుండే మీ బ్యాంక్ ఎకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఆశ్చర్యంగా ఉందా..? ఇది నిజమేనండి. పూర్తిగా తెలుసుకుని సులువుగా ఎకౌంట్ ఓపెన్ చేసేయండి. పూర్తి వివరాల్లోకి వెళితే… ఐడీబీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియను సులభం చేసింది. ఇప్పుడు వీడియో కేవైసీ అకౌంట్ ఓపెనింగ్ సర్వీసులు అందుబాటు లోకి తీసుకు వచ్చింది. ఇలా చేయడం మూలాన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావించే వారికి సులువవుతుంది.

ఈ ఎకౌంట్ ని ఎలా ఓపెన్ చెయ్యాలనే విషయం లోకి వస్తే… బ్యాంక్‌ లో అకౌంట్ ఓపెన్ చేయాలని భావించే వారు vkyc.idbibank.co.in లింక్ ఓపెన్ చెయ్యాలి. నేరుగా ఈ వెబ్‌సైట్‌కు వెళ్లి సులభంగానే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది గమనించండి. అలానే బ్యాంక్ సెలవుల్లో ఈ సేవలు ఉండవు. దీని కోసం ఇల్లు లేదా ఆఫీస్ నుంచే ఈ పని పూర్తి చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచుకు కూడా వెళ్లక్కర్లేదు. ఫిజికల్‌గా ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన పని లేదు.

ఈ సేవలని అందించడానికి కారణం కస్టమర్లకు మరింత బెనిఫిట్ అందించేందుకు మాత్రమేనని బ్యాంక్ తెలిపింది. ఇందులో భాగం గానే ఇప్పుడు వీడియో కేవైసీ అకౌంట్ ఓపెనింగ్ సేవలు తీసుకు వచ్చామని పేర్కొంది. దీని వల్ల కస్టమర్స్ కి ప్రయోజనం కలుగుతుందని ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ కాటన్‌హర్ చెప్పారు .

Read more RELATED
Recommended to you

Latest news