రుణగ్రహీతలకి గుడ్ న్యూస్…!

-

కరోనా మహమ్మారై అందర్నీ మరో సారి ఇబ్బందుల లోకి నెట్టేస్తోంది. రోజు రోజుకి చూస్తుంటే కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే వున్నాయి. వివిధ ప్రదేశాలలో లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడం కూడా చూస్తున్నాం. ఇది నిజంగా ఎందరో మందిని తీవ్ర ప్రభావానికి గురి చేస్తోంది. ఈ నేపధ్యం లో రుణ గ్రహీతలకు ఊరట కలగనుంది.

ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే…. కోవిడ్ 19 వలన ఆర్ధికంగా ఇబ్బందులు ఉండొచ్చని ఈ కారణంగా రుణ గ్రహీతలు మళ్లీ లోన్ ఈఎంఐ చెల్లించే పరిస్థితులలో ఉండలేరు ఏమో అని బ్యాంకులు అభిప్రాయ పడుతున్నాయి.

అందుకే ఈ విషయాన్ని దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కు చెప్పడం జరిగింది. దీనితో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దాని కోసం చూస్తే… రుణ గ్రహీతలకు మారటోరియం ఫెసిలిటీని మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్త పరిచినట్టు తెలుస్తోంది.

అయితే మరో మూడు నెలలు మారటోరియం బెనిఫిట్‌ను బ్యాంకులు ఆర్బీఐ ని కోరాయి. రుణ ఎగవేతలు పెరిగే ఛాన్స్ ఉందని… రిటైల్ రుణాలు తీసుకున్న వారికి, బిజినెస్ లోన్స్‌కు మారటోరియం కల్పించాలని బ్యాంకులు ఆర్బీఐ తో చెప్పాయి. ఆర్‌బీఐ గత ఏడాది ఆరు నెలలు మారటోరియం ప్రకటించింది. ఈసారి కూడా అలానే మారటోరియం ఉండేలా కనపడుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news