ఈ మహిళలకి కేంద్రం గుడ్ న్యూస్…!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని ప్రవేశ పెడుతూనే వుంది. వీటి వలన చాల మందికి బెనిఫిట్స్ కలుగనున్నాయి. అయితే ఇటువంటి స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన కూడా ఒకటి. దీని వలన కూడా అర్హులైన వాళ్లకి మంచి లాభం ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

 

ఇప్పటికే లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన మహిళలకు రూ.5 వేలు అందిస్తోంది. విడతల వారీగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. ప్రెగ్నెంట్ మహిళలకు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రూ.5 వేలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చి చేరతాయి. 19 ఏళ్ల కన్నా ముందే ప్రెగ్నెంట్ అయితే ఈ స్కీమ్ వర్తించదు గమనించండి. డబ్బులు ఎలా వస్తాయి అనేది చూస్తే… తొలి విడత కింద రూ.1000 వస్తాయి. తర్వాత రెండో విడత కింద రూ.2 వేలు లభిస్తాయి. అలాగే చివరి విడతలో మరో రూ.2 వేలు వస్తాయి. ఇలా మొత్తం రూ.5 వేలు మహిళల బ్యాంక్ ఎకౌంట్ లోకి వస్తాయి.

ఆన్‌లైన్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ స్కీమ్‌లో చేరచ్చు. లేదా మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్‌ లో చేర్పిస్తారు. www.Pmmvy-cas.nic.in లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్‌సైట్‌ లోకి వెళ్లొచ్చు. లాగిన్ అయ్యి మీరే రిజిస్టర్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version