ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ సైన్సెస్ 2-deoxy-D-glucose (2-DG) డెవలప్ చేయడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ హైదరాబాద్ తో కలిసి దీని మీద పని చేయడం జరిగింది. ఈ డ్రాగ్ పౌడర్ రూపంలో వస్తుంది ఇది నీటిలో కలుపుకుని తీసుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఏ డి ఆర్ డి ఓ సైంటిస్ట్ కొన్ని విషయాలను క్లియర్ చేశారు మరి వాటి కోసం చూద్దాం..
ఈ డ్రగ్ ని ఎలా తయారు చేశారు..?
కరోనా వైరస్ మొదటి వేవ్ వచ్చినప్పుడే మేము దీనిని మొదలు పెట్టాము. ఈ డ్రగ్ ని ఉపయోగించడం వల్ల కరోనా వైరస్ లోపల పెరిగి పోకుండా ఉంచుతుంది. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ కోసం పర్మిషన్ అడిగాము. మే 2020 లో మాకు పర్మిషన్ వచ్చింది. అక్టోబర్ 2020 కి మేము సెకండ్ ఫేస్ ట్రైల్స్ ని చేస్తున్నాము. మంచి రిజల్ట్స్ వచ్చాయి. కరోనా పేషెంట్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది.
స్టాండర్డ్ కేర్ అంటే ఏమిటి..?
స్టాండర్డ్ కేర్ అనేది ప్రైమరీ మెడిసిన్. ఆస్పత్రిలో ఉపయోగిస్తారు. పేషంట్స్ ని ట్రీట్ చేయడానికి పని చేస్తుంది.
కరోనా వైరస్ కి ఇది ఎలా పని చేస్తుంది…? అంటే సీరియస్ లక్షణాలు ఉంటేనా మైల్డ్ లక్షణాలు ఉంటేనా..?
మా క్లినికల్ ట్రయల్స్ లో మేము మోడరేట్ మరియు సీరియస్ లక్షణాలు వున్నా పేషెంట్స్ ని కూడా టెస్ట్ చేసాము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదు. ఇది చాలా సేఫ్ మెడిసిన్ అని మాకు తెలిసింది. అదే విధంగా రికవరీ రేటు కూడా ఎక్కువ అయింది. ఆక్సిజన్ తీసుకోవడం కూడా బాగున్నట్లు మేము గమనించాము.
ఈ డ్రగ్స్ కరోనా వైరస్ ని కంట్రోల్ చేస్తాయి కదా మరి ఆక్సిజన్ డిపెండెన్సీని తగ్గిస్తాయా..?
ఇది బాడీ లోకి వెళ్లి వైరస్ని పెరిగి పోకుండా కాపాడుతుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప్పుడు కూడా ఇది అడ్డుకుంటుంది. దీనితో ఆక్సిజన్ తీసుకోవడం కూడా సులభం అవుతుంది.
ఎప్పుడు ఇది పేషెంట్లు కి అందుతుంది..?
మేము దీని కోసం పని చేస్తున్నాము కొన్ని వారాల్లో లేదా ఒకే నెలలో ఈ మెడిసిన్ పేషెంట్స్ కి అందుబాటులో ఉంటుంది.
దీనిని ఉపయోగించిన పదార్థాలు ఇండియాలోవా లేదంటే ఇంపోర్ట్ చేశారా?
ఇందులో ఉపయోగించే పదార్థాలు కోసం ఇబ్బంది లేదు రెడ్డి ల్యాబ్ నుంచి మాకు వస్తాయి.