రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..మరో నాలుగు స్పెషల్ ట్రైన్స్..!

Join Our Community
follow manalokam on social media

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక ఇప్పటి నుండి మరో నాలుగు ప్రత్యేక ట్రైన్స్ పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్, ముజాఫర్‌పూర్-యశ్వంత్‌పూర్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇక వీటికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

రైలు నెంబర్ 02438 హజ్రత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. ఇది హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 3.35 గంటలకు స్టార్ట్ అవుతుంది. అలానే మరుసటి రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. నేటి నుండి ఇది 4 నుంచి ప్రతీ ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఇది ఇలా ఉండగా రైలు నెంబర్ 05228 ముజాఫర్‌పూర్ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్తుంది. ముజాఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 7.25 గంటలకు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఉదయం 11.15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఇది ఏప్రిల్ 4 నుంచి జూన్ 28 వరకు ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది.

రైలు నెంబర్ 02437 సికింద్రాబాద్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ ప్రయాణిస్తుంది. ఈ రైలు 2021 ఏప్రిల్ 7 నుంచి ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. అలానే రైలు నెంబర్ 05227 యశ్వంత్‌పూర్ నుంచి ముజాఫర్‌పూర్ ప్రయాణిస్తుంది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ ఫుల్ గా రిజర్వేషన్ చేయించుకోవాల్సిన రైళ్ళే.

 

 

 

 

 

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...