తెలంగాణ తరహాలో మాకూ రుణమాఫీ కావాలి:పంజాబ్ రైతులు

-

తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతించిన పంజాబ్ రైతులు తమకూ ఆ తరహా మాఫీ కావాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ కింద ఏటా వచ్చే ₹6వేలతో తమ భారం తీరట్లేదని, కాబట్టి రుణమాఫీ చేయాలని కేంద్రాన్ని కిసాన్ మజ్దాూర్ మోర్చా కోరింది. 2018లో నాటి ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మాఫీ ప్రకటించినా కేవలం 5.63లక్షల మందికే లబ్ధి చేకూరిందని తెలిపింది. కాగా రుణమాఫీతో తెలంగాణ ప్రభుత్వంపై ₹31 వేలకోట్ల భారం పడనుంది.

కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర కాబినెట్ సమావేశం జరిపారు. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news